మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి భ‌య‌ప‌డ్డారా?

వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ ఎం.సుధీర్‌రెడ్డి అధికారం లేక‌పోవ‌డంతో భ‌య‌ప‌డుతున్నారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డిపై అప్ప‌టి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఒంటికాలిపై లేచేవారు.…

వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ ఎం.సుధీర్‌రెడ్డి అధికారం లేక‌పోవ‌డంతో భ‌య‌ప‌డుతున్నారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డిపై అప్ప‌టి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఒంటికాలిపై లేచేవారు. పెద్దాచిన్నా అనే తేడా లేకుండా సుధీర్ నోరు పారేసుకోవ‌డం జ‌నంలో వ్య‌తిరేక‌త‌కు దారి తీసింది. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా వుంటున్నారు.

రెండు రోజుల క్రితం జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి సంస్కార‌హీనంగా మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డిపై మాట్లాడారు. కూట‌మికి ఓట్లు వేసిన వాళ్లు సైతం… ఆదినారాయ‌ణ‌రెడ్డి అస‌భ్య‌త‌ను అస‌హ్యించుకుంటున్నారు. త‌న గురించి ఆదినారాయ‌ణ‌రెడ్డి ఘాటుగా మాట్లాడినా సుధీర్‌రెడ్డి మాత్రం నోరు తెర‌వ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి మాత్రం ఆదినారాయ‌ణ‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి, డాక్ట‌ర్ సుధీర్ ఒకే ర‌కం నాయ‌కుల‌ని ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో అనుకుంటున్నారు. అధికారంలో ఉంటే త‌ప్ప‌, మీసాలు తిప్ప‌లేని అస‌మ‌ర్థుల‌ని జ‌నం విమ‌ర్శిస్తున్నారు.

2019లో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి భ‌యంతో టీడీపీని వీడిన విష‌యాన్ని జ‌నం గుర్తు చేస్తున్నారు. నిజంగా ధైర్య‌ప‌రుడైన నాయ‌కుడైతే, గ‌తంలో టీడీపీలోనే వుంటూ, వైసీపీతో ఢీకొట్టి వుండాల్సింద‌ని అంటున్నారు. సొంత జిల్లాకు చెందిన వైఎస్ జ‌గ‌న్ దెబ్బ‌కు టీడీపీ నుంచి బీజేపీకి జంప్ అయ్యార‌ని జ‌నం వ్యంగ్యంగా అనుకునే ప‌రిస్థితి. తాటాకు చ‌ప్పుళ్లు చేసే ఆదినారాయ‌ణ‌రెడ్డి, డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డి నోటి దురుసును జ‌నం త‌ప్పు ప‌డుతున్నారు. అయితే ఇంత‌కంటే మ‌న‌కు నాయ‌కులు లేర‌ని ప్ర‌జ‌లు స‌ర్ది చెప్పుకుంటున్నారు.

4 Replies to “మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి భ‌య‌ప‌డ్డారా?”

Comments are closed.