బీఆర్ఎస్‌లో చేరిన బిగ్‌బాస్ లేడీ కంటెస్టెంట్‌!

బిగ్‌బాస్ రియాల్టీ షో లేడీ కంటెస్టెంట్ క‌త్తి కార్తిక బీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లో తెలంగాణ భ‌వ‌న్‌లో శుక్ర‌వారం మంత్రి హ‌రీష్‌రావు చేతుల మీదుగా ఆమె బీఆర్ఎస్ కండువా క‌ప్పుకున్నారు. కాంగ్రెస్ నాయ‌కురాలైన క‌త్తి కార్తిక…

బిగ్‌బాస్ రియాల్టీ షో లేడీ కంటెస్టెంట్ క‌త్తి కార్తిక బీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లో తెలంగాణ భ‌వ‌న్‌లో శుక్ర‌వారం మంత్రి హ‌రీష్‌రావు చేతుల మీదుగా ఆమె బీఆర్ఎస్ కండువా క‌ప్పుకున్నారు. కాంగ్రెస్ నాయ‌కురాలైన క‌త్తి కార్తిక ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే అక్క‌డ సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో అధికార పార్టీలోకి జంప్ కావ‌డం గ‌మ‌నార్హం.

క‌త్తి కార్తిక‌కు రాజ‌కీయాల‌పై మొద‌టి నుంచి ఆస‌క్తి. దుబ్బాక ఉప ఎన్నిక‌లో ఆల్ ఇండియా ఫార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ త‌ర‌పున బ‌రిలో నిలిచారు. నియోజ‌క వ‌ర్గం వ్యాప్తంగా రోడ్‌షోలు నిర్వ‌హించి హ‌ల్‌చ‌ల్ సృష్టించారు. అనంత‌రం త‌న తాత స్ఫూర్తితో కాంగ్రెస్‌లో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్‌గాంధీ భార‌త్ జోడో యాత్ర చేప‌ట్ట‌గా క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కూ క‌త్తి కార్తిక న‌డిచారు.

రాహుల్‌తో న‌డ‌క త‌న రాజ‌కీయ జీవిత న‌డ‌క‌ను మారుస్తుంద‌ని ఆమె ఆశించారు. దుబ్బాక‌లో క‌నీసం నోటాకు వ‌చ్చిన‌న్ని ఓట్లు కూడా రాని క‌త్తికి టికెట్ ఎలా ఇస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు ప్ర‌శ్నించారు. 

ఏది ఏమైతేనేం ఆమె వ్యూహం ఫ‌లించ‌లేదు. దీంతో కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో బీఆర్ఎస్ కండువా క‌ప్పుకున్నారు. బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్ కావ‌డంతో ఆమె పార్టీ మార్పు వార్త అయ్యింది.