ఏడాది అవుతోందిగా … ప్రజల్లోకి వస్తాడట!

కేసీఆర్ మౌన మునిలా నెలల తరబడి ఫామ్ హౌజ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే కదా. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా పట్టించుకోవడంలేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రజలు, రైతులు నష్టపోతున్నా చలించడంలేదు. ప్రభుత్వ నిర్ణయాలపై…

కేసీఆర్ మౌన మునిలా నెలల తరబడి ఫామ్ హౌజ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే కదా. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా పట్టించుకోవడంలేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రజలు, రైతులు నష్టపోతున్నా చలించడంలేదు. ప్రభుత్వ నిర్ణయాలపై స్పందించడంలేదు.

హైడ్రాతో ప్రజలు గగ్గోలు పెడుతున్నా ఉలకడంలేదు, పలకడంలేదు. కేసీఆర్ మౌనంగా ఉండటంతో ఆయన ఆరోగ్యం మీద పుకార్లు వస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ కేసీఆర్ కొడుకు కేటీఆర్ తండ్రిని చంపేశాడేమో అని కూడా అన్నది.

గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ కనబడటంలేదని, ఆయన్ని వెతికి పట్టుకోవాలని పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. కేసీఆర్ గమ్మున ఉండేసరికి ఆయన్ని రకరకాలుగా బద్నాం చేస్తున్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వస్తాడని , తెలంగాణ భవన్ కు వచ్చి ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాలు పెడతాడని, ఇక రెగ్యులర్ గా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటాడని మీడియాలో అప్పుడప్పుడూ వార్తలు వచ్చాయి. కానీ ఏమీ కాలేదు.

కేసీఆర్ ఫామ్ హౌజ్ లో మౌనంగా ఏమీ లేడని, అక్కడికి వెళ్లినవారిని కలుస్తూనే ఉన్నాడని, రేవంత్ రెడ్డి సర్కారును గమనిస్తూనే ఉన్నాడని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు. తాజాగా ఓ టీవీ ఛానెల్ కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే విషయం తెలియజేసింది.

ఆయన డిసెంబర్ నుంచి ప్రజల్లోకి వస్తాడట ! అప్పుడే ఎందుకు? ముహూర్తాలు, మంచి రోజులుచూసుకునే అలవాటు ఉన్న కేసీఆర్ డిసెంబర్ లో ముహూర్తం చూసుకున్నాడా? అనే ప్రశ్నలు రావొచ్చు. అదేం కాదు. డిసెంబర్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. కాబట్టి అప్పటి నుంచి ప్రజల్లోకి రావాలని మాజీ సీఎం డిసైడ్ అయ్యాడట.

ఈ విషయం గులాబీ పార్టీ నాయకులకు చెప్పాడు. నాయకులు, పార్టీ కేడర్ డిసెంబర్ నాటికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు. పార్టీ నాయకులు డీలా పడుతున్న విషయం కేసీఆర్ కనిపెట్టాడట. తాను ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చాను కాబట్టి ఇక సమర శంఖం పూరించాలని నిర్ణయించుకున్నాడట.

అందులోనూ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఫేగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా బయటకు రాకపోతే పార్టీ నష్టపోతుందని నాయకులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై కేసీఆర్ బాగా ఆలోచించి సరే అన్నాడు. మరి తీహార్ జైలు నుంచి విడుదలైన కూతురు కవిత కూడా అప్పటినుంచి మౌనంగానే ఉంది. మరి ఆమె కూడా తండ్రి వెంటే జనంలోకి వస్తుందా ? ఆమె స్థానిక సంస్థల ఎమ్మెల్సీనే కదా.

6 Replies to “ఏడాది అవుతోందిగా … ప్రజల్లోకి వస్తాడట!”

  1. ప్రజలు దె0గిన తోడు దొంగలు.. ‘ఎర్రోడు యెలహంక ప్యాలెస్ లో, ముక్కోడు ఎర్రవెల్లి ఫార్మహౌజ్ లో దాక్కున్నారు..

Comments are closed.