కేసీఆర్ లో నచ్చినవీ..నచ్చనివీ- జెపి

లోక్ సత్తా అధినేత, మంచి విషయ పరిజ్ఙానం కలిగిన జయ ప్రకాష్ నారాయణ్ ను కలిసినపుడు, కేసీఆర్ మీద, తెరాస పాలన మీద అభిప్రాయం అడిగితే.. Advertisement ‘..రాష్ట్ర విభజన సమయంలో విపరీతమైన పరిస్థితులు…

లోక్ సత్తా అధినేత, మంచి విషయ పరిజ్ఙానం కలిగిన జయ ప్రకాష్ నారాయణ్ ను కలిసినపుడు, కేసీఆర్ మీద, తెరాస పాలన మీద అభిప్రాయం అడిగితే..

‘..రాష్ట్ర విభజన సమయంలో విపరీతమైన పరిస్థితులు నెలకొన్నాయి రెండు వైపులా. కాస్త ఆందోళన అనిపించింది. కానీ తెలంగాణ ఏర్పాటు తరువాత అన్ని వర్గాలను కలుపుకుని పోతూ, అందరికీ హైదరాబాద్ నాది అని చెప్పుకునే విధంగా పాలన సాగించడం నాకు బాగా నచ్చింది..‘

అలాగే గతంలో ఎన్టీఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు. హైదరాబాద్ అన్ని విధాలా అభివృద్ది చెందడానికి బాటలు వేసారు. వాటిని కొనసాగిస్తూ, ముందుకు సాగడం, మరింత అభివృద్ది సాధించడం బాగుంది.

కానీ..ఉపఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిపోవడం, దేశంలోనే కనీ వినీ ఎరుగని మొత్తాల్లో ఆ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయడం మాత్రం నచ్చలేదు. ఇది మంచి పరిణామం కాదు.