జ‌గ‌న‌న్న‌కు చెప్పి… కేటీఆర్ కామెంట్స్ వైర‌ల్‌!

తెలంగాణ మంత్రి కేటీఆర్‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మ‌ధ్య స్నేహ సంబంధాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తాజాగా వైఎస్ జ‌గ‌న్‌పై కేటీఆర్ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. రాంపూర్ ఐటీ…

తెలంగాణ మంత్రి కేటీఆర్‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మ‌ధ్య స్నేహ సంబంధాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తాజాగా వైఎస్ జ‌గ‌న్‌పై కేటీఆర్ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. రాంపూర్ ఐటీ పార్క్‌లో శుక్ర‌వారం  క్వాడ్రంట్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీని కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌సంగిస్తూ ఉపాధి కోసం వ‌ల‌స వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా ఎక్క‌డిక‌క్క‌డ పరిశ్ర‌మ‌లు పెట్టాల‌న్నారు.

బెంగ‌ళూరులో 40 శాతం మంది ఐటీ ఉద్యోగులు ఆంధ్రా, తెలంగాణ వాళ్లేన‌ని ఆయ‌న చెప్పారు. వాళ్లంతా తిరిగి సొంత ప్రాంతాల‌కు రావ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు. ఆంధ్రాలోని భీమ‌వ‌రం, నెల్లూరు ప్రాంతాల్లో భ‌విష్య‌త్‌లో గొప్ప ఉపాధి అవ‌కాశాలు వ‌స్తాయ‌ని ఆయ‌న అన్నారు. 

ఏపీలో కూడా ఐటీ కంపెనీలు పెట్టాల‌ని, అవ‌స‌ర‌మైతే జ‌గ‌న‌న్న‌కు చెప్పి అక్క‌డ స్థ‌లం ఇప్పిస్తాన‌ని క్వాడ్రంట్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీ య‌జ‌మానుల‌కు కేటీఆర్ సూచించారు.

ఈ కామెంట్స్‌తో స‌భ‌లో ఒక్క‌సారిగా ఆనందంతో కేక‌లు వేశారు. కేటీఆర్ స్పందిస్తూ త‌ప్పేం లేదన్నారు. అంద‌రూ బాగుప‌డాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. అంద‌రూ బాగుంటేనే దేశం బాగుంటుంద‌న్నారు. కులం, మ‌తం, ప్రాంతం పేర్లతో కొట్టుకు చావ‌ద్ద‌న్నారు. దేశానికి మంచి జ‌ర‌గాలంటే ఎక్క‌డివారికి అక్క‌డే ఉపాధి దొర‌కాల‌న్నారు.