ఏరులై పారిన మద్యం.. అర్థరాత్రి వరకు అమ్మకాలు

నూతన సంవత్సర వేడుకల సందర్బంగా నిన్న అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అధికారికంగా అనుమతులిచ్చారు. ఫలితంగా తెలంగాణలో మద్యం ఏరులై పారింది. మందుబాబులు లిక్కర్ సేల్ లో కొత్త రికార్డులు నెలకొల్పారు. దీంతో తెలంగాణ…

నూతన సంవత్సర వేడుకల సందర్బంగా నిన్న అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అధికారికంగా అనుమతులిచ్చారు. ఫలితంగా తెలంగాణలో మద్యం ఏరులై పారింది. మందుబాబులు లిక్కర్ సేల్ లో కొత్త రికార్డులు నెలకొల్పారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం చేకూరింది.

నిన్న ఒక్క రోజే తెలంగాణ ఎక్సైజ్ శాఖకు అక్షరాలా 215 కోట్ల 74 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. దీన్ని బట్టి తెలంగాణలో మద్యం అమ్మకాలు ఏ రేంజ్ లో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 19 మద్యం డిపోల నుంచి నిన్న ఉదయం నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు లక్షా 26వేల 455 బీర్ కేసులు అమ్ముడయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో కూడా జోరుగా మద్యం అమ్మకాలు సాగాయి. కాకపోతే తెలంగాణ అంత ఎక్కువగా ఏపీలో అమ్మకాలు సాగలేదు. అయితే ఏపీలో కూడా న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్ అమ్మకాల టైమ్ పెంచారు.

నిన్న ఒక్క రోజే ఆంధ్రప్రదేశ్ లో 127 కోట్ల రూపాయల లిక్కర్ సేల్ జరిగింది. సాధారణ రోజుల్లో ఏపీలో 70 కోట్ల నుంచి 72 కోట్ల రూపాయల మధ్యలో అమ్మకాలు జరుగుతాయి. అలాంటిది న్యూ ఇయర్ ప్రభావంతో, నిన్న ఒక్క రోజే అమ్మకాలు 127 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.