యుద్ధ రంగానికి వెళ్లాలని మంత్రి ఉత్సాహం…!

తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డిలో కూడా పాకిస్తాన్ పట్ల ఆగ్రహం పెల్లుబుకుతోంది.

సాధారణంగా ఏ దేశంలోనైనా యుద్ధ సమయంలో పౌరుల్లో, నాయకుల్లో దేశభక్తి ఉప్పొంగుతుంటుంది. శత్రు మూకలను చీల్చి చెండాడాలనే ఆవేశం వస్తుంది. కేవలం యువతలోనే కాదు వృద్ధుల్లోనూ ఆవేశం, ఆగ్రహం పెల్లుబుకుతుంటాయి. ఆల్రెడీ సైన్యంలో పనిచేసి రిటైరైన వారి సంగతి చెప్పనక్కరలేదు. వారిలో ఆగ్రహావేశాలు సాధారణ పౌరుల్లో కంటే ఒక పాలు ఎక్కువగా ఉరంటాయి.

ప్రస్తుతం భారత్, పాక్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో చాలామంది మాజీ సైనికులు, సైన్యాధికారులు అవసరమైతే కదనరంగంలో పోరాడుతామంటున్నారు. దేశం కోసం ప్రాణాలను పణంగా పెడతామంటున్నారు. ప్రభుత్వం అవసరమైతే మాజీ సైనికుల, సైన్యధికారుల సేవలు వినియోగించుకుంటుంది. వారి అనుభవం ఉపయోగపడుతుంది. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా రిటైర్డ్ సైనికాధికారులతో సమావేశమయ్యారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డిలో కూడా పాకిస్తాన్ పట్ల ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఆయన రాజకీయాల్లోకి రాకముందు సైన్యంలో పైలట్గా పనిచేశారు. యుద్ధ విమానాలను నడిపారు. కాబట్టి ఈ సమయంలో ఆయనకు ఆవేశం రావడం సహజం. భారత్, పాక్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలై ఒకవేళ ఆర్మీ తనను రమ్మని పిలిస్తే తప్పనిసరిగా యుద్ధరంగానికి వెళతానని అన్నారు. యుద్ధంలో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

తనకు ఇరవై ఏళ్ల వయసున్నప్పుడే యుద్ధ విమానానికి పైలట్గా పనిచేశానని చెప్పారు. 1982లో మిగ్21యుద్ధ విమానాన్ని, మిగ్23 విమానాన్ని నడిపానని చెప్పారు. రాష్ట్రపతి భవన్ లో పనిచేశారు. రాష్ట్రపతి విదేశీ ప్రయాణాలలో సెక్యూరిటీ ప్రోటోకాల్ కంట్రోలరుగా తన సేవలందించారు. తరువాత రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారిగా 1994లో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

అనంతరం 1999 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి మళ్లీ పోటీ చేసి గెలిచారు. 2004 శాసనసభ ఎన్నికలలో కోదాడ నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడ్డ హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు గెలిచారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక 2014, 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి టీఆర్‌ఎస్‌(ప్రస్తుతం బీఆర్ఎస్)అభ్యర్థిపై గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో గృహ, బలహీన వర్గాల మంత్రిగా పని చేశారు.

2 Replies to “యుద్ధ రంగానికి వెళ్లాలని మంత్రి ఉత్సాహం…!”

  1. వొంగోని కొబ్బరికాయ కొట్టలేని సన్నాసి “గే మోహన రెడ్డి” ని pakistan కి పంపండి.. @అక్కడ మునీర్ బట్టలూడదీసి లొంగదీసుకుంటాడు.. దెబ్బకి, ఏకంగా పాకిస్తాన్ ప్రధాని ఐపోవచ్చు .. ఏమంటావ్ రా గ్యాసు??

Comments are closed.