ఒక్కడు చేస్తే కాదు.. నలుగురితో చేయిస్తేనే నాయకుడు!

పవన్ కల్యాణ్ తానొక పార్టీకి నాయకుడు అని నిరూపించుకోవాలంటే.. తన పార్టీ వారందరితోనూ ఇలాంటి పనిచేయించాలి.

పవన్ కళ్యాణ్ తన వేతనాన్ని అనాధ పిల్లల కోసం వెచ్చించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఆయనను కచ్చితంగా అభినందించి తీరాలి. అయితే ఆయన తాను ఒక పార్టీకి అధినాయకుడు అనే సంగతిని ఆయన గుర్తించుకోవాలి. తాను ఒక్కడు ఇలాంటి మంచి పని చేయడం ఒక ఎత్తు.. పార్టీకి నాయకుడిగా ఉన్నప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేలు అందరితోనూ ఇలాంటి మంచి పని చేస్తే ఆయనకు దక్కగల కీర్తి ఇంకా గొప్పగా ఉంటుంది. అప్పుడే ఆయన వ్యక్తి కాదు వ్యవస్థ అని, నిజమైన నాయకుడు అని అనిపించుకుంటారు.

పవన్ కల్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా తనకు వచ్చే జీతం మొత్తాన్ని అనాథల కోసం ఖర్చు పెట్టదలచుకున్నారు. నిజానికి ఆయన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా అసలు జీతం తీసుకోకూడదనే అనుకున్నారట. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా జీతం తీసుకోరు. అయితే తాను ఆ పనిచేస్తే.. జగన్ ను అనుసరించినట్టుగా అవుతుందని అనుకున్నారేమోగానీ.. మొత్తానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. జీతం మొత్తాన్ని అనాథలకు ఖర్చు పెట్టాలనుకున్నారు.

పిఠాపురం ప్రజల వల్లనే తాను డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాను గనుక.. అక్కడి అనాథల కోసం ఖర్చు పెడతానని ఆయన అన్నారు. 42 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఐదువేల రూపాయల వంతున ఇవ్వనున్నారు. మిగిలిన జీతం కూడా వారికే ఖర్చు పెడతారట.

గతంలో వైసీపీలో ఉండి, ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇలాంటి పనే చేస్తుంటారు. గతంలో ఎమ్మెల్యేల జీతాలు పెంచడానికి శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు.. జీతం మీద ఆధారపడి బతికే ఎమ్మెల్యేలు ఎవ్వరూ మనలో లేరని, జీతం పెంచాల్సిన అవసరం లేదని సభలోనే చెప్పిన వ్యక్తి కోటంరెడ్డి. ఆయన తన జీతం మొత్తాన్ని తన నియోజకవర్గంలో పేదల కోసం, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతుంటారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా కోటంరెడ్డి బాటనే అనుసరించినట్లు అయింది.

కానీ పవన్ కల్యాణ్ తానొక పార్టీకి నాయకుడు అని నిరూపించుకోవాలంటే.. తన పార్టీ వారందరితోనూ ఇలాంటి పనిచేయించాలి. అప్పుడు రాష్ట్రమంతా కూడా ఆయన స్ఫూర్తి గురించి తెలుస్తోంది. మరింత మంచి పేరు వస్తుంది.

16 Replies to “ఒక్కడు చేస్తే కాదు.. నలుగురితో చేయిస్తేనే నాయకుడు!”

  1.  నాయకుడంటే మావోడిలా ప్యాలెస్ నలుగురితో చేయి0చడం తెలుసా?? ఎవరిమీద , ఎవరా నలుగురు తెలుసుకోవాలంటే 11PM – 4AM ఎలహంక ప్యాలెస్ దగ్గర గుసగుసల టీం ని కలవండి.

  2. ఫ్రీ గా  ఒక్క బస్తా భారతి సిమెంట్ ను పేదలు ఇల్లు కట్టుకోవటానికి ఎప్పుడైనా జగన్ రెడ్డి ఇచ్చాడా ?

  3. OK…..అందుకేనా GA….మన అన్నయ్య ఒక్కడే దోచుకుంటే గొప్ప కాదని, మీ వాళ్ళు అందరినీ 5yrs విచ్చలవిడిగా దోచుకు తినడానికి encourage చేసిన మన అన్నయ్య ను అంతలా పొగుడుతావు….great GA….TRUE DESTRUCTIVE LEADERSHIP…😂😂

  4. మరి ఇలాంటి మాటే జగన్ రెడ్డి సీఎం గా వున్నప్పుడు జీతం ఒక్క రూపాయి తీసుకుంటా అన్నప్పుడు మిగిలిన 150 మంది ఎమ్మెల్యే లతో కూడా అదే పని చేపిస్తే బాగుంటుంది అని ఇలాంటి ఆర్టికల్ ఎందుకు రాయలేదు నువ్వు ..??

    1. 2022 లో మాల ఓబుళాపురం గనుల ను అప్పజెప బోయాడు జగన్.he is a legend

  5. ఆలా ఐతే వరద బాధితుల సహాయం కోసం కోటి ప్రకటించి తర్వాత సైలెంట్ గ ఎగదొబ్బి మన అన్న పార్టీ లో అందరికి ఆదర్శం అయ్యారు అంటారు

  6. ముందు అన్నియ్య అర్భాటంగా ప్రకటించిన కోటి విషయం చెప్పు తరువాత పవన్ గారి మీద పడి ఏడుద్దువు కాని 

Comments are closed.