బెల్లం పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై హైదరాబాద్ లోని పలు చోట్ల ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల దగ్గరలో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు పెట్టడంతో సంచలనంగా మారింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అవినీతి అక్రమాలపేరుతో పోస్టర్లు వెలిశాయి.
దుర్గం చిన్నయ్య లాంటి కామ పిశాచి బారి నుంచి బెల్లంపల్లి ప్రజలను కాపాడలని.. చిన్నయ్య చేతిలో ఆర్థికంగా మోస పోయామని ఆరిజన్ డైరీ బాధితులం అంటూ.. కేసీఆర్, కేటీఆర్, మీడియా సంస్థలకు విన్నవించుకుంటూ.. మాకు న్యాయం చేయాలంటూ పోస్టర్లో పేర్కొన్నారు.
కాగా గతంలో కూడా తమను నమ్మించి ఎమ్మెల్యే మోసం చేశారని.. తమ డబ్బులు తీసుకుని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్ కు పంపిచారని అరిజిన్ పాల సంస్ధ ప్రతినిధులు ఆరోపించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎమ్మెల్యే చిన్నయ్యతో తమకు ప్రాణహాని ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆడియో, వాట్సప్ స్కీన్ షాట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.