పటాన్ చెరు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత మూడు రోజుల నుండి అనారోగ్యం కారణంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం మృతి చెందారు.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. నియోజకవర్గంలో తండ్రితో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో విష్ణువర్ధన్ రెడ్డి చురుగ్గా పాల్గొనేవారు. ఎన్నికల సమయంలో తండ్రి తరపున ప్రచారం నిర్వహించేవారు. దీంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు సంతాపం తెలుపుతున్నారు.
కాగా మహిపాల్ రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో రెండుసార్లు పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి పోటీలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు.