దేశంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. రాజకీయ నేతలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
మంగళవారం జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. అందులో పాజిటివ్ గా రిజల్ట్ వచ్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, కరోనా సోకడంతో కొన్ని రోజులు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు స్పీకర్ పోచారం తెలిపారు.
గత కొన్ని రోజులుగా తనను కలిసిన, తనతో సన్నిహితంగా ఉన్న వారంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమైనా లక్షణాలు ఉంటే కొవిడ్ టెస్ట్ చేయించుకుని తగిన ట్రీట్‌మెంట్ తీసుకోవాలని స్పీకర్ పోచారం తెలిపారు. స్పీకర్‌కు కరోనా సోకడం ఇది మూడోసారి.