నిత్యం వివాదాలతో వార్తలో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను మరో సారి పోలీసులు అరెస్టు చేశారు.
తనకు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం పదే పదే చెడిపోతోందని, ఎన్నిసార్లు మోర పెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, వాహనాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ ను కోరడానికి ప్రగతి భవన్ వెళ్లడంతో.. పోలీసులు రాజాసింగ్‌ను అడ్డుకోవడంతో తన వెంట తీసుకువచ్చిన బల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ప్రగతి భవన్ ముందు వదిలివేసే క్రమంలో.. రాజాసింగ్‌ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
నిన్నటి రోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఇంటికి వెళ్తుండగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ ఊడిపోయింది. స్పీడ్ తక్కవగా ఉండటంతో ఎవరికి ఏమి కాలేదు. ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిన వాహనం చాలా సార్లు నడిరోడ్డుపై ఆగిపోయిందని మోర పెట్టుకోవడం తెలిసిందే.