రేవంత్ చిరు ఆశ‌

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎలాగైనా పార్టీని బ‌తికించుకోవాల‌ని తాప‌త్ర‌య ప‌డుతున్నారు. మ‌రోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌కు పీకే దూర‌మ‌వుతార‌నే చిరు ఆశ‌తో ఉన్నారు.  Advertisement జాతీయ స్థాయిలో మోదీకి వ్య‌తిరేకంగా దేశంలోని…

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎలాగైనా పార్టీని బ‌తికించుకోవాల‌ని తాప‌త్ర‌య ప‌డుతున్నారు. మ‌రోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌కు పీకే దూర‌మ‌వుతార‌నే చిరు ఆశ‌తో ఉన్నారు. 

జాతీయ స్థాయిలో మోదీకి వ్య‌తిరేకంగా దేశంలోని అన్ని పార్టీల‌ను క‌లుపుకుని కూట‌మిగా ఏర్ప‌డాల‌ని సోనియాతో పాటు ప‌లువురు ఇత‌ర పార్టీల నేత‌లు ఆలోచిస్తున్నారు. అయితే రేవంత్‌రెడ్డికి మాత్రం వ్య‌క్తిగ‌త ఎజెండాను అమ‌లు చేయ‌డ‌మే ముఖ్య‌మైంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్‌కిషోర్ ప‌లు ద‌ఫాలు చ‌ర్చించారు. మ‌రోవైపు కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌తోనూ పీకే వ‌రుస భేటీలు పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీశాయి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌తో పీకే భేటీపై రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

టీఆర్ఎస్‌తో తెగ‌దెంపులు చేసుకునేందుకే కేసీఆర్‌తో ప్ర‌శాంత్ కిషోర్ చ‌ర్చించార‌ని అన్నారు. ఇక ప్ర‌శాంత్ కిషోర్‌కు టీఆర్ఎస్‌తో ఎలాంటి సంబంధం ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు. ఐప్యాక్‌తో పీకేకు ఎలాంటి సంబంధం ఉండదని రేవంత్‌రెడ్డి తెలిపారు. 

తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు నిజ‌మ‌వుతోంద‌న్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక తెలంగాణ రాష్ట్రానికి వచ్చి.. తనతో కలిసి ఉమ్మడి ప్రెస్‌మీట్ కూడా పెట్టే రోజు దగ్గరలోనే ఉందని జోస్యం చెప్పారు. ఆ రోజు పీకే స్వయంగా టీఆర్ఎస్‌ను ఓడించాల‌ని పిలుపునివ్వ‌డం అంద‌రూ వింటార‌న్నారు. 

ఇంకా పీకే చేరిక‌పై స్ప‌ష్ట‌త రాకుండానే రేవంత్‌రెడ్డి ఏవేవో ఊహించుకుని మాట్లాడుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసీఆర్‌తో పీకే క‌లిస్తే రేవంత్‌కు భ‌యమేంటో అర్థం కావ‌డం లేద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు ప్ర‌శ్నిస్తున్నాయి. 

ఇటు జాతీయ స్థాయిలోనూ, అటు తెలంగాణ రాజ‌కీయాల్లోనూ పీకే కేంద్ర బిందువు కావ‌డం విశేషం.