కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పొత్తులపై చేసిన కీలక వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చారించారు.
ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి నష్టం కలిగేలా ఎవరూ మాట్లాడొద్దని, అలా ఎవరూ మాట్లాడినా ఉపేక్షించబోమని, బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ ఇప్పటికే సృష్టం చేశారని, బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని ఎవరు మాట్లాడినా చర్యలు తప్పావని రాహుల్ గాంధీ సృష్టం చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో రాబోయోది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో కూడా ఆయన సొంత పార్టీపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు కూడా పొత్తులపై చేసిన వ్యాఖ్యలు దూమరం రేగడంతో కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేతో కలిసి కోమటిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు.