ముగియనున్న ష‌ర్మిల డెడ్‌లైన్‌.. వాట్‌ నెక్ట్స్‌?

ఈ నెల 30లోపు విలీనంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని, కాంగ్రెస్‌తో క‌ల‌వ‌క‌పోతే సొంతగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతామ‌ని ప్ర‌క‌టించిన వైయ‌స్ ష‌ర్మిల డెడ్ లైన్ ఇవ్వాళ‌తో ముగియ‌నుంది. మరి షర్మిల చెప్పినట్లు ఇవాళ విలీనంపై ప్రకటన…

ఈ నెల 30లోపు విలీనంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని, కాంగ్రెస్‌తో క‌ల‌వ‌క‌పోతే సొంతగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతామ‌ని ప్ర‌క‌టించిన వైయ‌స్ ష‌ర్మిల డెడ్ లైన్ ఇవ్వాళ‌తో ముగియ‌నుంది. మరి షర్మిల చెప్పినట్లు ఇవాళ విలీనంపై ప్రకటన ఉంటుందా లేక తెలంగాణలోని మొత్తం నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేస్తారా అనే విషయం ప్రకటిస్తారా అనేది రాజకీయ వర్గాల్లో ఆస‌క్తి నెలకొంది.

నాలుగు రోజుల క్రితం త‌మ పార్టీ నాయ‌కుల స‌మావేశంలో ష‌ర్మిల మాట్లాడుతూ.. ఈ నెల 30లోపు విలీనంపై నిర్ణయం తీసుకుంటామని, విలీనం లేకుంటే వ‌చ్చే ఎన్నికల్లో సొంతగా బరిలోకి దిగుతామని నేతలకు ఉద్భోదించారు. అక్టోబ‌ర్ రెండో వారం నుండి ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో ఉండేలా కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేస్తున్నామ‌ని.. పార్టీ కార్య‌వ‌ర్గం ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని.. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన ప్ర‌తిఒక్క‌రికీ ప్రాధాన్య‌త ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. 

మరోవైపు విలీనంపై కాంగ్రెస్ అధినేతలతో పలు దపాలుగా ష‌ర్మిల‌ చర్చలు జరిపింది. కొన్ని రోజుల పాటు పార్టీ విలీనం ఇవాళ రేపో అన్నట్లుగా సాగిన.. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి షర్మిల రాకను అడ్డగిస్తున్నార‌నే నేపద్యంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా షర్మిల పార్టీకి దూరం జరిగింది. బ‌హుశా అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు ష‌ర్మిల పార్టీపై కాంగ్రెస్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకునే ప‌రిస్థితి క‌న‌ప‌డ‌టం లేదు. మ‌రోవైపు ఇప్ప‌టికే తాను పాలేరు నుండి ఎన్నికల బ‌రిలోకి దిగుతా అంటూ ప్ర‌క‌టించిన ష‌ర్మిలకుచెక్ పెడుతూ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావును కాంగ్రెస్‌లోకి అహ్వానించి పాలేరు టికెట్‌పై భ‌రోసా ఇవ్వ‌డంతో ష‌ర్మిల డైలామాలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

బహుశా డెడ్‌లైన్‌ ఇవాళ ముగియడంతో ష‌ర్మిల నుంచి ఎటువంటి ప్రకటన వస్తుందా అనేది అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ షర్మిల పార్టీ అని నియోజకవర్గాల్లో నిలబడితే మాత్రం అది త‌ప్ప‌కుండా కాంగ్రెస్ పార్టీకే నష్టమే కలగవచ్చు. వైయ‌స్ఆర్ అభిమానులు ష‌ర్మిల పార్టీ వైపు మొగ్గు చూపే అవ‌కాశ‌లు ఉన్నాయి. ఏది ఏమైనా అసెంబ్లీ ఫలితాలు తర్వాతే ఏ పార్టీ వల్ల ఎవరికి నష్టం వ‌చ్చిందో అనేది తెలుస్తుంది.