తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టి వేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంత్రికి సానుకూల ఫలితం రాలేదు. ఆయన ఎన్నిక చెల్లదనే పిటిషన్‌ను విచారించేందుకే హైకోర్టు సుముఖత వ్యక్తం చేయడం విశేషం. అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించారనే కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదనే తీర్పు వచ్చిన సమయంలోనే, మంత్రికి కూడా న్యాయస్థానంలో ప్రతికూల నిర్ణయం వెలువడడం చర్చనీయాంశమైంది.
మహబూబ్‌నగర్ నుంచి వరుసగా రెండోసారి టీఆర్ఎస్ తరపున శ్రీనివాస్‌గౌడ్ గెలుపొందారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా శ్రీనివాస్ గౌడ్ మెలుగుతున్నారు. దీంతో ఆయన మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇదిలా వుండగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు ద్రువ పత్రాలు సమర్పించారనే కారణంతో మహబూబ్‌నగర్‌కు చెందిన ఓటరు రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
శ్రీనివాస్‌కు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని ఆ పిటిషన్‌లో రాఘవేంద్ర పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, కావున కొట్టి వేయాలని కోరుతూ శ్రీనివాస్ గౌడ్ న్యాయస్థానాన్ని కోరారు. ఇరువైపు వాదనలను న్యాయస్థానం విన్నది. అయితే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నట్టు రాఘవేంద్ర పిటిషన్‌కు విచారణ అర్హత లేదనే వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. మంత్రి పిటిషన్‌ను కొట్టి వేసింది.
రాఘవేంద్ర రాజు పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడం విశేషం. దీంతో మంత్రికి హైకోర్టు ఇచ్చినట్టైంది. వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసిన సందర్భంలోనే అధికార పార్టీకి చెందిన మరో నాయకుడిపై అలాంటి పిటిషన్‌కు సంబంధించి ప్రతికూల తీర్పు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.