మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో సారి సంచలన ప్రకటనతో వార్తల్లో నిలిచాడు. ఎమ్మెల్సీ కవితతో సుఖేష్ చేసిన వాట్సాప్ చాట్ అంటూ స్క్రీన్ షార్ట్స్ రిలీజ్ చేశారు సుకేష్ తరపు లాయర్. ఆ స్క్రీన్ షార్ట్స్ వాట్సాప్ చాట్ లో తెలుగు రాని సుఖేష్ అక్కడక్కడా తెలుగు పదాలతో చాట్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కవితతో చాట్ ఇదేనంటూ సుఖేష్ బయటపెట్టిన స్క్రీన్ షాట్ లలో కవితక్క – టీఆర్ఎస్ అనే పేరుతో ఫోన్ నంబర్ ను సేవ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఏకే, ఎస్‌జే, ఏపీ, సిస్టర్ పేర్లతో కోడ్ భాషలో చాటింగ్ చేసినట్లు ఉంది. అలాగే 15కేజీల నెయ్యి డెలివరీ చేశానని కోడ్ భాషలో సుఖేష్ తెలిపాడు. ప్యాకెట్ నీకు అందజేస్తానని ఏజే చెప్పారని చాట్‌లో సుఖేష్ పేర్కొన్నాడు. తాజా స్క్రీన్ షార్ట్స్ తో తెలంగాణలో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
కాగా గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను హెచ్చరిస్తూ రెండు పేజీల లేఖను విడుదల చేశారు. కేజ్రీవాల్, మంత్రి సత్యేంద్ర జైన్ సూచనతోనే తాను హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర ఆ పార్టీ చెందిన నేతకు రూ.15 కోట్లు ఇచ్చానని.. ఆ బీఆర్ఎస్ నేతతో జరిగిన వాట్సాప్ చాట్‌ను కూడా లేఖలో ప్రస్తావించాడు. బీఆర్ఎస్ ప్రాంగణంలో 6069 నెంబర్ గల రేంజ్ రోవర్ పార్క్ చేసి ఉందని తెలిపిన సుఖేష్.. ఆ కారుపై ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉందని కూడా పేర్కొన్నాడు. తాను చేస్తున్న వ్యాఖ్యల పట్ల అవసరమైతే తాను నార్కో టెస్ట్‌కు కూడా సిద్ధమని సుఖేష్ ప్రకటించాడు. ఇది జస్ట్ టీజరేనని.. అసలైన బ్లాక్ బస్టర్ ముందు ముందు రిలీజ్ చేస్తానంటూ హెచ్చరించినట్లు గానే ఇవాళ వాట్సాప్ చాట్ రిలీజ్ చేశారు.