హోంవర్క్ చేయలేదని కొట్టిన టీచర్.. బాబు మృతి

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. హోం వర్క్ చేయలేదని పిల్లాడ్ని కొట్టింది టీచర్. తీవ్రంగా గాయపడిన విద్యార్థి, ఈరోజు చనిపోయాడు. ఇంతకీ బాబు ఏం చదువుతున్నాడో తెలుసా? జస్ట్ యూకేజీ. Advertisement అభంశుభం తెలియని…

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. హోం వర్క్ చేయలేదని పిల్లాడ్ని కొట్టింది టీచర్. తీవ్రంగా గాయపడిన విద్యార్థి, ఈరోజు చనిపోయాడు. ఇంతకీ బాబు ఏం చదువుతున్నాడో తెలుసా? జస్ట్ యూకేజీ.

అభంశుభం తెలియని వయసు. ఆడుకోవడం కోసం మాత్రమే స్కూల్ కు వెళ్లాల్సిన చదువు అది. హేమంత్ కూడా అంతే. రామాంతపూర్ లోని వివేక్ నగర్ లో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో యూకేజీ చదువుతున్నాడు ఈ చిన్న బాబు.  

ఎప్పట్లానే శనివారం కూడా స్కూల్ కు వెళ్లాడు హేమంత్. కానీ ఎందుకో హోంవర్క్ మాత్రం చేయలేదు. ఈ విషయం టీచర్ కు కోపం తెప్పించింది. వెంటనే చేతిలో ఉన్న పలకతో హేమంత్ తలపై కొట్టింది. ఆ దెబ్బతో చిన్నారి హేమంత్ స్పృహ కోల్పోయాడు.

వెంటనే బాబును హాస్పిటల్ లో జాయిన్ చేశారు. తలలో తీవ్రగాయం కావడంతో, మృత్యువుతో పోరాడి ఈరోజు ఉదయం చనిపోయాడు బాబు. మృతదేహంతో తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళన చేశారు.

అయితే ఈరోజు శెలవు కావడంతో స్కూల్ యాజమాన్యం అందుబాటులోకి రాలేదు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణవేణి స్కూల్ పై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.