తెలంగాణ ఎన్నిక‌ల‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. స‌రిగ్గా 50 రోజుల గ‌డువు మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు వుంది. తెలంగాణ‌తో పాటు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. స‌రిగ్గా 50 రోజుల గ‌డువు మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు వుంది. తెలంగాణ‌తో పాటు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌టించింది. తెలంగాణ మ‌న తెలుగు రాష్ట్రం కావ‌డంతో ఆ ఎన్నిక‌ల‌పై ఆస‌క్తి నెల‌కుంది.

న‌వంబ‌ర్ 30న రాష్ట్ర‌మంతా ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌డంతో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. తెలంగాణ‌కు సంబంధించి సీఈసీ రాజీవ్‌కుమార్ వివ‌రాలు వెల్ల‌డించారు.

తెలంగాణ‌లో మొత్తం 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. మొత్తం 3.17 కోట్ల మందికి ఓటు హక్కు ఉంది. వీరిలో 1.58 కోట్ల మంది పురుషులు, 1.58 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉండ‌డం విశేషం. తెలంగాణ‌లో స్త్రీపురుష ఓట‌ర్ల సంఖ్య స‌మానంగా వుంద‌న్న మాట‌. ఈ ద‌ఫా కొత్త‌గా  8.11 లక్షల మంది కొత్త ఓట‌ర్లున్నారు.  

ఎన్నిక‌ల‌కు సంబంధించి న‌వంబ‌ర్ 3న నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది. అదే నెల 10న నామినేష‌న్లు స్వీక‌రించ‌నున్నారు. 13న స్క్రూటి, 15న ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఇచ్చారు. నవంబ‌ర్ 31న ఎన్నిక‌లు, డిసెంబ‌ర్ 3న కౌంటింగ్ ప్ర‌క్రియ వుంటుంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. స‌గ‌టును 897 మంది ఓట‌ర్ల‌కు ఒక పోలింగ్ కేంద్రం వుంటుంద‌ని సీఈసీ వెల్ల‌డించారు. 50 రోజుల్లో ప్ర‌జాభిమానం చూర‌గొనే పార్టీ ఏదో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.