తెలంగాణ రైతులకు భరోసా…ఏపీలో ఏదీ?

కూటమి అపరిమితమైన అధికారాన్ని పొందడానికి రైతులకు ఇచ్చిన భరోసా హామీ కూడా కీలకంగా పని చేసింది.

తెలంగాణ రైతులకు డబుల్ బొనాంజా. ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు మరో శుభవార్తను రైతులకు చెప్పింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.12 వేలు ఇవ్వడానికి తాజాగా మార్గదర్శకాలు జారీ చేయడం విశేషం. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. పంటలు పండీ, దిగుబడి ఇళ్లకు చేరుకునే సమయంలో సంక్రాంతిని జరుపుకుంటారు.

సంక్రాంతిని పురస్కరించుకుని తెలంగాణ రైతుల్లో సంతోషం నింపే భరోసా ప్రకటన వెలువడింది. ఈ నేపధ్యంలో ఏపీ రైతులు తమకేం భరోసా ఉందని ప్రశ్నిస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్ నాటికి కూటమి ప్రభుత్వం ఏపీలో కొలువుదీరింది. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేలు చొప్పున భరోసా సొమ్ము అందజేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.

కూటమి అపరిమితమైన అధికారాన్ని పొందడానికి రైతులకు ఇచ్చిన భరోసా హామీ కూడా కీలకంగా పని చేసింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమకు రూ.20 వేలు ఎప్పుడు అందుతుందో అని ఏపీ రైతాంగం ఆశతో ఎదురు చూస్తున్నారు. నిరాశే మిగిలింది. ఇప్పటికీ రైతులకు భరోసా సొమ్ము అందజేతపై స్పష్టత ఇవ్వకపోవడం విమర్శకు దారి తీసింది.

మరోవైపు తెలంగాణలో మాత్రం రూ.2 లక్షల వరకు రుణమాఫీ, మళ్లీ ఎకరాకు రూ.12 వేలు చొప్పున ఇవ్వడానికి మార్గదర్శకాలు ఇవ్వడం తెలంగాణ‌ రైతాంగంలో సంతోషాన్ని నింపుతుంది. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

4 Replies to “తెలంగాణ రైతులకు భరోసా…ఏపీలో ఏదీ?”

  1. నిజమైన రైతులకు కావలసింది ఇది కాదు దుక్కు దమ్ము కోత నూర్పిడి వంటివి తక్కువ రేట్లకు యంత్రపరికరాలు దొరికే విధం గ చేస్తే రైతుకు లాభదాయకం గ ఉంటుంది స్ప్రేయర్ లు weeder లు వంటివి తక్కువ రేట్లకు అద్దెకు దొరికే విధం గ చేయాలి

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.