యూత్ కాంగ్రెస్ పార్టీతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలోకి చేరి ఎమ్మెల్యే, మంత్రిగా చేసి చంద్రబాబుతో రాజకీయా విభేదాల వల్ల టీడీపీ నుండి బయటికి వచ్చిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణనే మొదటి అజెండాగా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీగా ఆవిర్భవించింది. ఇవాళ తెలంగాణ భవన్ లో జాతీయ పార్టీని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా, తీర్మానానికి ఆమోదం తెలుపుతూ 283 మంది సభ్యులు ఆమోదముద్ర వేయడంతో పాటు సంతకాలు సేకరించారు. తీర్మానం అనంతరం 1.19 గంటలకు కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.