రాజకీయ కమెడియన్‌గా గుర్తింపు పొందిన కేఏ పాల్‌పై తెలంగాణ అధికార పార్టీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. రాజకీయాల్లో సరదా క్యారెక్టర్‌గా భావించే పాల్‌పై భౌతికదాడికి దిగడంపై ప్రతిపక్షాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సీరియస్ రాజకీయాలంటే ఎలా వుంటాయో మొదటిసారిగా కేఏ పాల్‌కు అనుభవంలోకి వచ్చాయి. కొన్ని రోజులుగా ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
రైతాంగం కోసం బహిరంగసభ నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తానే రాబోయే కాలంలో కాబోయే సీఎంగా తనకు తాను అభివర్ణించుకున్నారు. అలాంటి కేఏపాల్‌పై అధికార పార్టీ దాడికి దిగడం గమనార్హం. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు బయల్దేరారు.
ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు సిద్దిపేట సరిహద్దులో కేఏ పాల్‌ను అడ్డుకున్నాయి. పాల్ కారుకు అడ్డంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో కేఏ పాల్ కారు దిగి టీఆర్‌ఎస్ కార్యకర్తలతో చర్చిస్తుండగా, కొందరు సహనం కోల్పోయి ఆయనపై చేయి చేసుకున్నారు.
తమ నాయకుడిపై దాడి చేయడాన్ని పాల్ అనుచరులు తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో పాల్‌కు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన పోలీసులు ఆయన్ను ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి పంపారు.