మేనల్లుడు అంటే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ మేనల్లుడు. ఆయనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు కేసీఆర్ కాకుండా ముగ్గురివే. వారు.. కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, కూతురు కవిత. వీరిలో పార్టీకి ఫిల్లర్స్ లాంటి వారు కేటీఆర్ అండ్ హరీష్ రావు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశం దశను అండ్ దిశను మార్చేసి గాయిగాత్తర లేపుతానని భీకర ప్రతిజ్ఞ చేసిన కేసీఆర్ చివరకు ఫామ్ హౌజ్ కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణాలు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీగా ఉన్న గులాబీ పార్టీని మళ్ళీ ప్రాంతీయ పార్టీగా మార్చాలనే డిమాండ్ పార్టీ నాయకుల నుంచి వచ్చింది.
కానీ కేసీఆర్ ససేమిరా అన్నాడు. తెలంగాణ సెంటిమెంటు వదిలేసిన కారణంగానే అధికారం కోల్పోయామని పార్టీ నాయకులు గగ్గోలు పెట్టారు. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు. ఏనాటికైనా తాను నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్లి చక్రం తిప్పుతానని కేసీఆర్ కు ఆశగా ఉన్నట్లుంది.
సరే… గులాబీ పార్టీ మళ్ళీ ప్రాంతీయ పార్టీగా అంటే టీఆర్ఎస్ గా మారే అవకాశం లేదని తెలుసుకున్న పార్టీ నాయకులు కొందరు హరీష్ రావు పేరును తెరమీదికి తెచ్చారు. పార్టీలో ఆయనకు బలమైన వర్గం ఉంది. బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాబట్టి దానికి కేసీఆర్ జాతీయ అధ్యక్షుడు అయ్యాడు. కేటీఆర్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. రాష్ట్రానికి ప్రెసిడెంట్ లేడు.
కాబట్టి ఆ పోస్టు హరీష్ రావుకు ఇవ్వాలనే కేసీఆర్ ముందు పెట్టారని సమాచారం. హరీష్ రావు మద్దతుదారులు ఏమంటున్నారంటే.. కేటీఆర్ కు అర్బన్ ఏరియాల్లో పాపులారిటీ ఉంది. హరీష్ రావుకు రూరల్ ఏరియాల్లో పాపులారిటీ ఉంది. గ్రామీణ తెలంగాణలో హరీష్ రావుకు తిరుగులేని చరిష్మా ఉందని చెబుతున్నారు. కేటీఆర్ కు తండ్రి ఆశీస్సులు ఉంటే, హరీష్ రావుకు గ్రామీణ ప్రజల అభిమానం ఉందని చెబుతున్నారు.
ఒకవేళ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వకపోయినా హరీష్ రావుకు కూడా కేటీఆర్ తో సమానంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వాలంటున్నారు. హరీష్ రావుకు కీలక పదవి ఇస్తే పార్టీ మళ్ళీ పుంజుకొని పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారట. పార్టీలో హరీష్ రావు కీలకమైన నాయకుడు. ఆయనకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. మామ మాదిరిగానే మాటకారి. సౌమ్యుడిగా పేరుంది.
ప్రతిపక్షాలు ఎప్పుడూ తమ పొలిటికల్ గేమ్ లో భాగంగా హరీష్ రావు పార్టీలో తిరుగుబాటు చేసే అవకాశం ఉందని చెబుతుంటాయి. చాలా ఏళ్ళ నుంచి ఈ మాట చెబుతున్నాయి. కానీ హరీష్ రావు ఎన్నడూ దీనిపై స్పందించలేదు. కామెంట్ చేయలేదు.
గతంలో ఒకసారి కేటీఆర్ ను సీఎం చేస్తే తనకు అభ్యంతరం లేదన్నాడు. తాను ఆయన దగ్గర కూడా పని చేస్తానని చెప్పాడు. కేసీఆర్ మాటే తనకు వేదవాక్కు అన్నాడు. కానీ పార్టీలో ఆయనకు జరగాల్సిన న్యాయం జరగడంలేదనే ఫీలింగ్ ఆయన వర్గంవారిలో ఉంది.
టీడీపీలో కూడా చంద్రబాబు పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఏపీకి ప్రెసిడెంట్ ఉన్నాడు. తొందరలో తెలంగాణకు కూడా నియమిస్తాడు. మరి కేసీఆర్ మేనల్లుడికి ఎలాంటి న్యాయం చేస్తాడో!
Call boy works 8341510897
vc estanu 9380537747