Advertisement

Advertisement


Home > Politics - Telangana

రాజ్యాంగ సంస్థ‌ల‌ను వేట‌కుక్క‌ల్లా...!

రాజ్యాంగ సంస్థ‌ల‌ను వేట‌కుక్క‌ల్లా...!

కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప్ర‌ధాని మోదీ విధానాల‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు వ‌స్తుందేమోన‌ని కేటీఆర్ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డే రోజులు త‌ప్ప‌కుండా వ‌స్తాయ‌న్నారు.

దేశంలో అంబేద్క‌ర్ రాజ్యాంగం అమ‌లు కావ‌డం లేదన్నారు. మోదీ రాజ్యాంగం అమ‌ల‌వుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ‌కు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప‌ని చేస్తార‌నే సంపూర్ణ విశ్వాసంతో య‌శ్వంత్ సిన్హా అభ్య‌ర్థిత్వానికి మ‌ద్ద‌తు తెలిపిన‌ట్టు కేటీఆర్ వెల్ల‌డించారు. కేంద్ర ప్ర‌భుత్వం ఒక నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తోందన్నారు. 8 రాష్ట్రాల్లో వారికి మెజార్టీ లేక‌పోయినా ఆయా ప్ర‌భుత్వాల‌ను త‌ల‌కిందులు చేసి, ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసే విధంగా బ‌రితెగింపు రాజ‌కీయాలు చేస్తున్నారని బీజేపీపై మండిప‌డ్డారు.

రాజ్యాంగ సంస్థ‌ల‌ను గుప్పిట్లో పెట్టుకుని విప‌క్షాలపై వేటకుక్క‌ల్లాగా వాటిని ఉసిగొల్పి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను నెర‌వేర్చుకుంటున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ ధోర‌ణిని తిర‌స్క‌రించాల్సిన బాధ్య‌త ప్ర‌జాస్వామ్యంపై న‌మ్మ‌క‌మున్న అన్ని పార్టీల‌కు ఉంటుంద‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బీజేపీ ప్ర‌తిపాదించిన అభ్య‌ర్థిని నిర్ద్వందంగా తిర‌స్క‌రిస్తున్న‌ట్టు కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తివ్వాల‌ని ఇత‌ర పార్టీల‌కు కూడా విజ్ఞ‌ప్తి చేస్తున్నామ‌ని తెలిపారు.

ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము ప‌ట్ల‌ వ్య‌క్తిగ‌తంగా త‌మ‌కు వ్య‌తిరేక‌త లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ద్రౌప‌ది మంచి వ్య‌క్తే కావొచ్చన్నారు. అయితే గిరిజ‌న‌, మ‌హిళా అభ్య‌ర్థిని అని చెప్ప‌డం స‌రికాద‌న్నారు. జ‌న‌వ‌రి 2, 2006లో ఒడిశాలో క‌ళింగ‌న‌గ‌ర్‌లో స్టీల్ ప్లాంట్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్న 13 మంది గిరిజ‌నుల‌ను కాల్చిచంపార‌ని కేటీఆర్ గుర్తు చేశారు. 

అప్ప‌టి ప్ర‌భుత్వంలో బీజేపీ భాగ‌స్వామి అన్నారు. అంతేకాదు, అందులో ద్రౌప‌ది మంత్రిగా ఉన్నార‌ని, ఆమె ఎలాంటి సానుభూతి తెలప‌లేద‌న్నారు. గిరిజ‌నుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని ఒక్క మాట కూడా ద్రౌప‌ది ముర్ము మాట్లాడ‌లేద‌ని కేటీఆర్ విమ‌ర్శించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?