Advertisement

Advertisement


Home > Politics - Telangana

జ‌న‌సేన‌తోనే పొత్తు.. టీడీపీతో కాదు!

జ‌న‌సేన‌తోనే పొత్తు.. టీడీపీతో కాదు!

పాపం చంద్ర‌బాబు.. ఎల‌గైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని అధికారంలోకి తేవడానికి ప్ర‌య‌త్నిస్తు బీజేపీ పార్టీ వైపు చూస్తుంటే వారు ఏమో టీడీపీని ఛీ.. కొడుతున్నారు. బీజేపీలోని ఒక వ‌ర్గం నేత‌లు త‌ప్ప.. ఏ ఇత‌ర బీజేపీ నాయకులు మాట్లాడిన టీడీపీతో బీజేపీ జ‌త క‌లిసే ప్రసక్తినే లేదంటూన్నారు.

తాజాగా బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ హైద‌రాబాదులో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీతో పొత్తు ఆలోచ‌న బీజేపీకి లేద‌ని సృష్టం చేశారు. ఏపీలో త‌మ‌కు జ‌న‌సేన పార్టీతో త‌ప్ప మ‌రే ఇత‌ర పార్టీతో పొత్తు లేద‌ని సృష్టం చేశారు.

ఒక‌వైపు బీజేపీ నేత‌లు జ‌న‌సేనతోనే మా పొత్తు అంటుంటే జ‌న‌సేన అధినేత మాత్రం టీడీపీతో పొత్తు కొసం ఆరాట‌ప‌తున్నారు. జ‌న‌సేన పొత్తు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ర‌కేనా లేక తెలంగాణ‌లో కూడా కొన‌సాగిస్తార అనేది క్లారిటి ఇచ్చింటే బాగుండేదంటూన్నారు తెలంగాణ జ‌న‌సేన కార్యకర్తలు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ది మందిలో ఉన్న‌ప్పుడు అప్యాయంగా క‌ర‌చ‌ల‌నం చేస్తేనే నానా హ‌డ‌వుడి చేసి దేశం మొత్తానికి తమ అధినేత చంద్ర‌బాబు ఆవ‌స‌రం ఉంద‌ని చెప్పుతూ త‌మ అధినేత కోసం ఢిల్లీ తలుపులు ఎప్పూడు తెరిచి ఉంటాయి అని హ‌డ‌వుడి చేసిన కుల మీడియా ఇప్పుడు ల‌క్ష్మ‌ణ్ మాట‌లకు ఏమంటుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?