Advertisement

Advertisement


Home > Politics - Telangana

క‌విత‌కు ద‌క్క‌ని ఊర‌ట‌!

క‌విత‌కు ద‌క్క‌ని ఊర‌ట‌!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ‌కుంట్ల క‌విత‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ పిటిష‌న్‌పై న్యాయ‌స్థానంలో ఊర‌ట ద‌క్క‌లేదు. చిన్న కుమారుడికి 11వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లున్నాయ‌ని, ఈ స‌మ‌యంలో త‌ల్లిగా బిడ్డ‌తోనే వుండాల‌ని కోరుతూ మ‌ధ్యంత‌ర బెయిల్ పిటిష‌న్‌ను ఆమె దాఖ‌లు చేశారు. క‌విత పిటిష‌న్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో 4న విచార‌ణ జ‌రిగింది.

ఇప్ప‌టికే ఏడు ప‌రీక్ష‌లు పూర్త‌య్యాయ‌ని, బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ గ‌ట్టిగా వాద‌న‌లు వినిపించింది. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి కావేరి బ‌వేజా తీర్పును నాలుగు రోజుల క్రితం రిజ‌ర్వ్ చేశారు. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెల‌కుంది. ఉత్కంఠ‌కు తెర‌దించుతూ తీర్పు వెలువ‌రించారు. ఈడీ వాద‌న‌ల వైపే న్యాయ‌మూర్తి మొగ్గు చూపారు. క‌విత మ‌ధ్యంత‌ర బెయిల్ పిటిష‌న్‌ను న్యాయ‌స్థానం కొట్టి వేసింది.

ఈ నెల 20న క‌విత రెగ్యులర్ బెయిల్‌పై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఇదిలా ఉండ‌గా మ‌ద్యం కుంభ‌కోణం కేసులో గ‌త నెల 15న హైద‌రాబాద్‌లో క‌విత‌ను ఈడీ అరెస్ట్ చేసింది. రెండు విడ‌త‌లుగా ఈడీ క‌విత‌ను విచారించింది. అనంత‌రం ఆమెను గ‌త నెల 26న తీహార్ జైలుకు త‌ర‌లించారు.

ఈ నెల 9వ తేదీతో క‌విత 14 రోజుల జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ ముగుస్తుంది. ఆమెను కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్నారు. క‌విత బెయిల్ పిటిష‌న్‌ను కొట్టి వేయ‌డంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెల‌కుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?