Advertisement

Advertisement


Home > Politics - Telangana

హ‌లో రేవంత్‌... ఇంకా బాబు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాలేదా?

హ‌లో రేవంత్‌... ఇంకా బాబు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాలేదా?

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై విజ‌య‌వాడ‌లో రాయితో దాడి జ‌రిగింది. దీంతో ఆయ‌న ఎడ‌మ క‌న్నుపై దెబ్బ త‌గిలింది. ర‌క్త గాయాల‌య్యాయి. సీఎం జ‌గ‌న్‌పై దాడిని ప్ర‌ధాని మోదీ, ప‌శ్చిమ‌బెంగాల్‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రులు మ‌మ‌తాబెన‌ర్జీ, స్టాలిన్ త‌దిత‌ర ప్ర‌ముఖులు ఖండించారు. జ‌గ‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

అయితే ఇంత వ‌ర‌కూ పొరుగునే ఉన్న మ‌రో తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. తాను సీఎం అయిన‌ప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా మాత్ర‌మే జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు చెప్పార‌ని రేవంత్ ఒక ఇంట‌ర్వ్యూలో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌హ‌జంగా తోటి తెలుగు ముఖ్య‌మంత్రి ఫోన్ చేసి విషెస్ చెప్పి వుండాల్సింద‌ని రేవంత్ అభిప్రాయం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

గొప్ప‌గొప్ప నీతులు చెప్పిన రేవంత్‌రెడ్డికి జ‌గ‌న్‌పై దాడి జ‌రిగితే క‌నీసం స్పందించాల‌నే స్పృహ లేదా? అనే ప్ర‌శ్న పౌర స‌మాజం నుంచి వ‌స్తోంది. ఇంకా త‌న మాజీ బాస్ చంద్ర‌బాబునాయుడి నుంచి గ్రీస్ సిగ్న‌ల్ వెళ్ల‌లేదా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఎదుటి వాళ్ల నుంచి గౌర‌వాన్ని కోరుకున్న‌ప్పుడు, తాను కూడా అదే రీతిలో వ్య‌వ‌హ‌రించాల‌నే సంస్కారం వుండాలి కదా అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

రేవంత్‌రెడ్డి తానింకా టీడీపీ నాయకుడిగా భావిస్తున్నారేమో అని, అందుకే చంద్ర‌బాబు చెబితే త‌ప్ప‌, జ‌గ‌న్‌పై దాడిని ఖండించేలా లేర‌ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?