తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ వెళ్లే ఏపీ అంబులెన్స్‌లకు మార్గం సుగుమమైంది. రాష్ట్ర సరిహద్దుల్లో ఎలాంటి అడ్డం కులు లేకపోవడంతో మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్‌కు అంబులెన్స్‌లు సయ్యిమంటూ దూసుకుపోతున్నాయి.
గత వారం రోజులుగా రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ నుంచి వెళుతున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వివాదమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. అంబులెన్స్‌లను అడ్డుకునే హక్కు కేసీఆర్ సర్కార్‌కు లేదని తేల్చి చెప్పింది. ఇక మీదట సరిహద్దుల్లో అంబులెన్స్‌లను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని కోర్టు హితవు చెప్పింది. దీంతో అంబులె న్స్‌లకు అడ్డంకులు తొలగాయి.
హైకోర్టు ఆదేశాలతో.. రాత్రి 10 గంటల నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అనుమతించారు. ప్రస్తుతం పాసులు లేకున్నా కొవిడ్ బాధితుల వివరాలు నమోదు చేసుకొని అంబులెన్స్‌లను పంపిస్తున్నారు. దీంతో హైదరాబాద్ వెళ్లనున్న రోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు.