కేసీఆర్ స‌ర్కార్‌పై గ‌వ‌ర్న‌ర్ పెద్ద మాటే అనేశారే

కేసీఆర్ స‌ర్కార్‌పై ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పెద్ద మాటే అనేశారు. క‌రోనా క‌ట్ట‌డిలో తెలంగాణ స‌ర్కార్ క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిం చ‌లేదంటూ…ప‌రోక్షంగా విఫ‌ల‌మైంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. కొంత కాలంగా కేసీఆర్ స‌ర్కార్‌, గ‌వ‌ర్న‌ర్‌కు…

కేసీఆర్ స‌ర్కార్‌పై ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పెద్ద మాటే అనేశారు. క‌రోనా క‌ట్ట‌డిలో తెలంగాణ స‌ర్కార్ క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిం చ‌లేదంటూ…ప‌రోక్షంగా విఫ‌ల‌మైంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. కొంత కాలంగా కేసీఆర్ స‌ర్కార్‌, గ‌వ‌ర్న‌ర్‌కు మ‌ధ్య ప్ర‌చ్ఛ న్న యుద్ధం సాగుతున్న విష‌యం తెలిసిందే. క‌రోనా క‌ట్ట‌డిపై చ‌ర్చించేందుకు సీఎస్‌తో పాటు వైద్యారోగ్య‌శాఖ ఉన్న‌తాధికా రుల‌ను రాజ్‌భ‌వ‌న్‌కు రావాల‌ని గ‌వ‌ర్న‌ర్ ఆదేశించడం…వాళ్లు అ స‌మ‌యంలో కాకుండా మ‌రుస‌టి రోజు వెళ్లిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో జాతీయ మీడియాకు మంగ‌ళ‌వారం తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనాను అరిక‌ట్ట‌డంలో తెలంగాణ స‌ర్కార్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఆమె అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.  కరోనా వ్యాప్తిని కేసీఆర్ స‌ర్కార్  అంచనా వేయలేకపోయిందన్నారు.  కరోనా విజృంభ‌ణ‌పై   ప్రభుత్వాన్ని హెచ్చరించ‌డంతో పాటు ప‌లు సూచనలు చేస్తూ ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని  తమిళిసై వాపోయారు.

కట్టడి ప్రాంతాల విషయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని గ‌వ‌ర్న‌ర్ విమర్శించారు. తెలంగాణ‌లో   ప్రభుత్వాస్పత్రుల్లో సౌక‌ర్యాలు కొర‌వ‌డ‌డంతో  ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారన్నారు. క‌రోనా రోగుల‌కు వైద్యం అందించ‌డం  తెలంగాణ ప్రభుత్వానికి భారంగా మారిందని గ‌వ‌ర్న‌ర్ అన్నారు. అయితే రోగుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నామ‌ని ప్రభుత్వం చెబుతున్న‌ప్ప‌టికీ… ప్రభుత్వాస్పత్రులపై  రోగులు ఆసక్తి చూపడం లేదన్నారు. తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై సీఎం కేసీఆర్‌తో  గట్టిగా చెప్పానని తమిళిసై అన్నారు.

గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ స‌ర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టికే తెలంగాణ స‌ర్కార్‌కు గ‌వ‌ర్న‌ర్‌తో అంత మంచి సంబంధాలు లేవ‌ని ప్ర‌చార‌మ‌వుతున్న నేప‌థ్యంలో…తాజా ప‌రిణామాలు ఏ ప‌రిస్థితికి దారి తీస్తాయో చూడాలి. ప‌శ్చిమ‌బెంగాల్‌లో గ‌వ‌ర్న‌ర్‌, మ‌మ‌త స‌ర్కార్ మ‌ధ్య ఓ యుద్ధ‌మే జ‌రుగుతోంది. అలాంటి ప‌రిస్థితులు ఇక్క‌డ త‌లెత్తే అవ‌కాశం లేదని రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. 

హైద్రాబాదులో నీ ఘనకార్యాలు అవేనా