రాజ్యాంగం, ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఇలా చాలానే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్నారు. మరి నిమ్మగడ్డ నిన్నా నేడూ ఎన్నికల కమిషనర్ గా లేరుగా. ఆయన 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆ పదవిలో ఉన్నారు.
మరి స్థానిక ఎన్నికల గడువు 2018 ఆగస్ట్ లో పూర్తి అయింది. అప్పుడు నిమ్మగడ్డకు వెంటనే ఎన్నికలు పెట్టాలి. అది రాజ్యాంగ అవసరం అని ఎందుకు గుర్తుకు రాలేదో. పైగా కేంద్రం నుంచి లోకల్ బాడీస్ కి వచ్చే నిధులు ఆగిపోతాయన్న ఆలోచన ఆయనకు ఎందుకు రాలేదో.
ఇది నిజంగా నిఖార్స్ అయిన ప్రశ్నే. వైసీపీ మంత్రి కురసాల కన్నబాబు ఇదే ప్రశ్నను సూటిగానే నిమ్మగడ్డను అడుగుతున్నారు. నాడు చంద్రబాబుని ఎన్నికలు పెట్టమని ఎందుకు ఆర్డర్ వేయలేదో చెబుతారా అంటూ బాగానే అడిగారు.
ఎన్నికల కమిషన్ రమేష్ కమిషన్ గా మారిందని కూడా ఆయన అంటున్నారు. చంద్రబాబు ఎపుడు వాయిదా వేయామంటే వేయడం, మళ్ళీ ఎపుడు పెట్టమంటే పెట్టడం తప్ప నిమ్మగడ్డ సొంతగా పనిచేస్తున్నారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
నిమ్మగడ్డ రిటైర్ అయ్యాక ఏపీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తారేమోనని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారంటే రాజ్యాంగ పదవిలో ఉన్న వారు తమ తీరుని ఒకసారి సమీక్ష చేసుకోవాల్సిందే కదా.