ఎందరో వచ్చారు. ఎన్నెన్నో కబుర్లు చెప్పారు. విశాఖను అందాల నగరమంగా చేస్తామని కూడా పెద్ద మాటలే వాడారు. కానీ ఇపుడే ఆ పని పక్కాగా జరుగుతోంది. విశాఖ మీద వైసీపీ దృష్టి పెట్టింది. అంతే మహా నగరం రూపు రేఖలు ఒక్కసారిగా మారిపోతున్నాయి.
విశాఖలో దాదాపుగా ఎనిమిది వందల దాకా మురికివాడలు ఉన్నాయి. వీటిలో లక్షకు పైగా ప్రజానీకం జీవిస్తున్నారు. వీరంతా అత్యంత దుర్బర పరిస్థితులలో దశాబ్దాలుగా బతుకులీడుస్తున్నారు.
వీరి గురించి ఆలోచించేవారే లేరు. చాలా మంది పెద్ద నాయకులు విశాఖ వచ్చినపుడల్లా చెప్పే మాట ఒక్కటే విశాఖ నడిబొడ్డిన దిష్టి చుక్కలా మురికివాడలు వద్దు, వాటిని ఎక్కడికైనా తరలించండి అని. కానీ వారికి అక్కడ నుంచి పంపించాలంటే వేరే చోట చక్కని ఆవాసాలు ఉండాలిగా. ఇపుడు వైసీపీ సర్కార్ పట్టుదలగా ఆ పని చేస్తోంది.
విశాఖలో మురికివాడలలో పెద్ద ఎత్తున సర్వే చేస్తున్నారు. పక్కా డేటా కూడా కలెక్ట్ చేస్తున్నారు. వారందరికీ పునరావాసం కూడా కల్పించేందుకు ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేస్తోంది. మొత్తానికి ఇన్నాళ్లకు మా దశ మారిందని మురికివాడల జనం అనుకుంటున్నారు అంటే నిజంగా ఇదే కదా అసలైన అభివృద్ధి అంటున్నారు నగర జనం.