టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగింది. ఇంత వరకూ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టున్న రాజకీయం క్రమంగా వాటి మధ్యలో కాంగ్రెస్ కూడా చేరుతోంది. దీంతో మూడు ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.
తమ అధినేతలను అంటే జిల్లా నాయకులు మొదలుకుని, రాష్ట్ర నాయకుల వరకూ దీటైన సమాధానాలతో విరుచుకు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డిపై ఆ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు.
రేవంత్‌రెడ్డిని బిగ్‌బాస్ ఫేమ్ ముమైత్ ఖాన్‌తో పోల్చడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తమదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. కౌశిక్‌రెడ్డిని వివాదాస్పద నటి శ్రీరెడ్డితో పోల్చి దెబ్బకు దెబ్బ అంటున్నారు.
కాంగ్రెస్ కిసాన్ సెల్ కరీనంగర్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. సిగ్గు, శరం లేకుండా కౌశిక్ మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చే స్క్రిప్టు చదివే నీకు సిగ్గు ఉండాలని హితవు పలికారు.
ముమైత్ ఖాన్‌తో రేవంత్‌రెడ్డిని పోలుస్తావా బిడ్డా.. నువ్వు శ్రీరెడ్డిలా వ్యవహరిస్తున్నావని సెటైర్ విసిరారు. నువ్వు, నీ అన్న కోట్లాది రూపాయాలు తీసుకొని జీహెచ్ఎంసీ, జనరల్ ఎలక్షన్లలో టికెట్లు అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ నీకు టికెట్ ఇస్తా అని చెప్పిండా, అప్పుడు నీ వయస్సు ఎంత, చెడ్డీలు కూడా వేసుకోలేదు బిడ్డా అంటూ ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు.