వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతోంది. ఒక ప్రభుత్వ నడకను అర్థం చేసుకోవడం భవిష్యత్తు ఎలా ఉంటుందని అంచనా వేసేందుకు ఇది సరైన సమయం.
సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి తర్వాత జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రధానంగా పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా జగన్ పెదలలో మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కొత్త విషయం కాదు. ఆ మాట కొస్తే చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా అమలు చేసింది.
రెండు ప్రభుత్వాలు మధ్య వ్యత్యాసం చంద్రబాబు గారి హయామంలో పథకాలు అమలు నిరంతరం వివాదాలుగా మారింది. ఇచ్చిన హామీకి అమలుకు మధ్య వ్యత్యాసం ఎక్కువ. జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా పథకాలు అమలు చేయడం నిరంతర ప్రక్రియగా మార్చారు. సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల సమయంలో ఇవ్వడం అమలు చేయడంగా ఉన్న దాన్ని గెలిచిన మొదటి నుంచి అమలు చేయడం ద్వారా వైయస్ జగన్ ప్రజల విశ్వాసాన్ని పొందారు. కరోనా విపత్తు రావడంతో పథకాల అమలు ప్రజలకు మేలు జరుగుతుంది.
మరో మూడు సంవత్సరాలలో ఎన్నికలు జరుగుతుంది. పేదలలో సానుకూల స్పందన ఉన్నప్పటికీ అధికార పార్టీ తాను గెలవడానికి దోహద పడిన కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు కనపడటం లేదు. ఎన్నికల సమీపానికి ఇది అధికార పార్టీకి అర్థం కావచ్చు. వైసిపి ప్రతిపక్ష పార్టీ పాత్రలో ఉన్నప్పుడు నాటి అధికార తెలుగుదేశం ప్రభుత్వం పై ఉన్న ప్రతి వ్యతిరేకతను బాగా ఉపయోగించుకున్నది.
అధికారంలో ఉన్న పార్టీకి అనేక అంశాలపై వ్యతిరేకంగా వివిధ రూపాల్లో పోరాటాలు జరుగుతుంటాయి. పోరాడే వారికి ప్రతిపక్ష పార్టీతో అనుబంధం లేకపోయినా వారు చేసే పోరాటాల ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఉపయోగపడుతుంది. అలా వైసీపీ కి అనేక అంశాలు ఉపయోగపడటం వల్ల అనూహ్య విజయాన్ని సాధించింది.
విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి దృష్టి తనమీదనే ఉంటుంది. అన్న వాస్తవాన్ని వైసిపి గుర్తించడం లేదని పాలన చూస్తే అర్థం చేసుకోవచ్చు. వైసిపి మొదటి నుంచి నమ్ముతున్నది తాము ఎవరితోనూ కలవము ఒంటరిగా పొరాడుతామని. విపక్ష పాత్రకు సరిపోవచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన పాత్రను గుర్తించడంలేదు. ఉదాహరణకు ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల విషయంలో తెలుగుదేశం మినహా అన్ని పార్టీలు వెంటనే నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.
ఎవరితోనూ మాట్లాడే అలవాటు లేని అధికార పార్టీ అనుకూల వాతావరణం ఏర్పడినా ఉపయోగించుకుని పద్ధతి లేని కారణంగా అన్ని పార్టీలు ఒక్కటి వైసిపి ఒక్కటి అన్న విమర్శలు ఎదుర్కొన్నది. సమాధానం చెప్పడానికన్నా ఎదురుదాడికి మొగ్గుచూపుతున్నారు. 100 కారణాలు వైసిపి విజయానికి కారణం అయినది. ఒక్కో కారణం విడివిడిగా చూస్తే చిన్నవిగా కనిపిస్తుంది. అలా చిన్న చిన్న కారణంగా చూపి వాటి పాత్రను గుర్తించడం లేదు.
రాబోవు కాలంలో అవి తనకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. అలా అన్ని కలిపితే ఎన్నికల నాటికి తనకు రాజాకీయంగా సవాలుగా మారే ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ఇంకా మూడు సంవత్సరాలు సమయం ఉన్నది, జగన్ వ్యతిరేక శక్తులు విడివిడిగా ఉన్నాయి . తాము ఒంటరిగా ఉంటాము అంటే అన్ని ఒక్క తాటి మీదకు రావడం విషయం కాదు. అలాంటి పరిస్థితి నెలకొనక ముందే జాగ్రత్త పడటానికి ఇది సరైన సమయం
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, రాజకీయ విశ్లేషకులు