చంద్రబాబు రాజకీయ జీవితం ఓ విధంగా పూలపానుపు లాంటిదేనని చెప్పుకోవాలి. ఆయన పెద్దగా పోరాటాలు చేయకుండానే యువకుడిగా ఉన్నపుడే కాంగ్రెస్ లో చేరి టికెట్ తెచ్చుకుని మంత్రి అయ్యారు. ఆ తరువాత సొంత మామ ఎన్టీయార్ పెట్టిన పార్టీలో చేరి తానే అధికార కేంద్రంగా మారారు.
ఒక దశంలో పిల్లనిచ్చిన మామనే కూలదోసి ముఖ్యమంత్రి అయిపోయారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా బాబు చేసిన పోరాటాలు అన్నీ మీడియా ముఖంగానే ఉంటాయన్న విమర్శలూ ఉన్నాయి.కానీ ఆయన వైఖరి మాత్రం లేస్తే మనిషిని కాదన్నట్లుగా ఉంటుంది. మాట్లాడితే జైలుకు పోతాను, నన్ను జైల్లో పెట్టినా సరే పోరాటాలు ఆపను అంతూ రొటీను డైలాగులు కొడతారని ప్రచారమూ ఉంది.
నిజంగా అటువంటి పరిస్థితే ఉంటే ఆ కధే వేరుగా ఉంటుందని ప్రత్యర్ధులు సెటైర్లు వేసినా బాబు అసలు పట్టించుకోరు. ఆయన తన పోరాటం ఎంత స్ట్రాంగో చెప్పడానికే పదే పదే జైలుకు పోతా అంటూంటారంటారు.ఇవన్నీ ఇలా ఉంచితే ఈ మధ్య స్పీకర్ తమ్మినేని సీతారాం బాబుకు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. అమరావతి రాజధానిని తరలిస్తే నేను జైలుకైనా వెళ్ళి పోరాడుతా అంటూ బాబు తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ పైన తనదైన శైలిలో తమ్మినేని సెటైర్లు వేశారు.
బాబు అంత ముచ్చట పడి జైలుకు పోతాను అంటే తీహార్ జైలు ఖాళీగానే ఉందంటూ తమ్మినేని వేసిన సెటైర్ కి తమ్ముళ్ళు గుక్కతిప్పుకోలేరేమో. ఎందుకంటే తీహార్ జైల్లో రెండు నెలల పాటు ఉండి ఈ మధ్యనే బయటకు వచ్చారు కాంగ్రెస్ దిగ్గజం చిదంబరం. ఆయనతో బాబుకు దోస్తీ కూడా ఉందంటారు.
అప్పట్లో చీకట్లో చిదంబరాన్ని బాబు కలిశారంటూ మంచి రైమింగ్ తో టైమింగుతో వైసీపీ నేతలు తరచూ ఆరోపణలు చేస్తారు కూడా. చిదంబరం జైలుకు వెళ్ళింది న ఆర్ధిక నేరల ఆరోపణల మీద బాబు మీద అనేక కేసుల్లో స్టేలు ఉన్నాయి. బహుశా ఇవన్నీ ద్రుష్టిలో ఉంచుకునే తమ్మినేని వారు తీహార్ జైలు ఖాళీగా ఉందంటూ సెటైర్లు వేశారని అంటున్నారు. మరి బాబు రియాక్షన్ ఏంటో చూడాలి.