నాకు కొత్త ఏడాది ఇప్పుడు మొదలైంది – త్రిష

కొత్త ఏడాదిలో తనకు కొత్తగా కరోనా సోకిందని కొన్ని రోజుల కిందట తన బాధను వ్యక్తంచేసింది సీనియర్ హీరోయిన్ త్రిష. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డానని వాపోయింది. దాదాపు కరోనాకు చెందిన…

కొత్త ఏడాదిలో తనకు కొత్తగా కరోనా సోకిందని కొన్ని రోజుల కిందట తన బాధను వ్యక్తంచేసింది సీనియర్ హీరోయిన్ త్రిష. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డానని వాపోయింది. దాదాపు కరోనాకు చెందిన అన్ని లక్షణాలు తనకు ఉన్నాయని బాధపడింది. అలా కరోనాతో ఇబ్బంది పడిన ఈ ముద్దుగుమ్మ ఈరోజు బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టింది.

కొద్ది సేపటి కిందట త్రిష మరో పోస్ట్ పెట్టింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చినట్టు తెలిపింది. జీవితంలో తొలిసారి నెగెటివ్ అనే పదాన్ని చదివినప్పుడు చాలా ఆనందం వేసిందని చెప్పుకొచ్చిన త్రిష.. దాదాపు 10 రోజుల తర్వాత కాలు బయటపెట్టింది. కారులో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసింది.

ఇవాళ్టి నుంచి 2022ను రెట్టించిన ఉత్సాహంతో మొదలుపెడతానని ప్రకటించింది త్రిష. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలిపింది.

20 ఏళ్లకు పైగా కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ చెన్నై బ్యూటీ.. ఇప్పటికీ సినిమాలతో బిజీగా ఉండడం విశేషం. ఇప్పటికే 3 తమిళ సినిమాలు పూర్తిచేసింది. ఓ మలయాళం సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. ప్రస్తుతం ఆమె ఓ సినిమా డబ్బింగ్ కు వెళ్తూ ఇలా సెల్ఫీ దిగింది.