ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తనే స్వయంగా వాట్సప్ స్టేటస్ ద్వారా ప్రకటించారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇప్పటికే ఏపీకి చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కరోనా బారిన పడి…హైదరాబాద్‌లో చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకుని తిరిగి తన విధుల్లో నిమగ్నమయ్యారు. అలాగే వైసీపీ ముఖ్య నాయకుడు విజయసాయిరెడ్డి కూడా కరోనాకు గురై కోలుకున్నారు.
ఏపీలో నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కూడా కరోనాకు గురైన విషయం తెలిసిందే. అనేక మంది ఎమ్మె ల్యేలు, ఇతరత్రా నాయకులు కరోనా మహమ్మారి బారి నుంచి తప్పించుకోలేకపోయారు. అయితే ఏపీలో మాజీ మంత్రి, బీజేపీ నేత కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి చెందారు. ఇతరత్రా నాయకుల స్థాయిలో మరణించిన వాళ్లు ఎవరూ లేరనే చెప్పాలి. మంత్రి సురేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.