సింహాచలం ఆస్తులపై మంత్రి గారి బాంబు… ?

దేవుడు ఆస్తులు అంటే అందరికీ లోకువే. అందుకే అవి చాలా ఈజీగా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఉత్తరాంధ్రాలోనే ఘనత వహించిన సింహాచలం దేవస్థానం భూముల విషయంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్…

దేవుడు ఆస్తులు అంటే అందరికీ లోకువే. అందుకే అవి చాలా ఈజీగా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఉత్తరాంధ్రాలోనే ఘనత వహించిన సింహాచలం దేవస్థానం భూముల విషయంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ భారీ బాంబే పేల్చారు.

వందల ఎకరాలు రికార్డుల నుంచి తారు మారు అయ్యాయి. అంతే కాదు, ఎవరికీ తెలియకుండా చాలా ఆస్తులు అమ్మేశారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. 

ఇప్పటికే ఇద్దరి అధికారులను సస్పెండ్ చేశామని, లోతైన విచారణ జరుగుతోందని త్వరలోనే ఇంకా సంచలన విషయాలే బయటపెడతామని మంత్రి అంటున్నారు. 

మరి ఆ సంచలనాలు ఏంటి అన్నది ఉత్కంఠను కలిగించే విషయమే మరి. ఈ సందర్భంగా నాడూ నేడూ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు ఆస్తులను కాపాడలేకపోయారని కూడా మంత్రి విమర్శించారు. 

ఈ విషయంలో ఎవరు బాధ్యులైనా వారు ఎంతటివారు అయినా చట్టప్రకారం చర్యలు తప్పవని వెల్లంపల్లి గట్టిగానే సౌండ్ చేస్తున్నారు. మొత్తానికి మంత్రి హాట్ కామెంట్స్ తో సరికొత్త సమరానికి తెరలేచినట్లుగానే అనిపిస్తోంది.