రాజకీయాల్లో ఒరవడి మారింది. ట్రెడిషనల్ పాలిటిక్స్ రూట్ కూడా చేంజ్ అయింది. సోషల్ మీడియా సాధనాల ద్వారా విమర్శలను సైతం సూటిగా ఘాటుగా గుచ్చుకునేట్టుగా సంధించి వదలడం ఈనాటి పొలిటికల్ ట్రెండ్. దాన్ని ఒడిసి పట్టుకున్న నయా నాయకుడిగా వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి ఎపుడూ ముందుంటారు.
ఆయన చంద్రబాబు, చినబాబుల మీద వేసే పంచుల రేంజే వేరు అన్నట్లుగా ఉంటుంది. ఇక లేటెస్ట్ గా విజయసాయిరెడ్డి వేసిన పంచ్ ని చూస్తే అల్టిమేట్ అనిపించేలా ఉంది. ఆయన చంద్రబాబు గురించి మాట్లాడుతూ బాబు చేసిన పాపాలతో చిత్రగుప్తుడి హార్డ్ డిస్క్ ఏనాడో ఫుల్ అయిపోయిదని పంచ్ పేల్చారు.
దశాబ్దాలుగా బాబు అండ్ కో చేసిన అరాచకాలు, కిరాతకాలకు లెక్క కూడా చిక్కడంలేదంటూ గట్టిగానే తగులుకున్నారు. సుపారీ హత్యల కల్చర్ ఎల్లో బ్యాచ్ దేనని విజయసాయిరెడ్డి పేర్కొంటూ పెనుగొండ నుంచి మచిలీపట్నం దాకా చేయించిన హత్యల ఉసురు తగలకుండా ఎవరూ తప్పించుకోలేరు అని ఫైర్ అయ్యారు.
ఇక చినబాబు గురించి విజయసాయిరెడ్డి బాగానే సెటైర్లు వేశారు. తండ్రి నుంచి చినబాబు నేర్చుకున్నవిద్య ఏంటి అంటే అబద్దాలు అల్లడం, గుడ్డ కాల్చి అవతల వారి ముఖాన పడేయడం లాంటి ట్రిక్కులేనని ఎద్దేవా చేశారు. బాబు వారసుడుకి సంక్షేమ గురించి ఏం తెలుసు అని కూడా వెటకారం ఆడారు.
మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డి ట్వీట్ చేయాలే అందులోని పంచులకు ఎవరైనా ఎంజాయ్ చేయాల్సిందే. ఇక టీడీపీ పెద్దల విషయం అయితే విజయసాయిరెడ్డి పంచుల మీద కౌంటర్లు వేయలేక సతమతమవుతున్నారు అనుకోవాలేమో.