తమ కూతురికి మాయ మాటలు చెప్పి గత రాత్రి ఎత్తుకెళ్లాడని కార్పొరేటర్ భర్తపై బాధితులు చెప్పుతో దాడికి దిగారు. ఈ ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. కార్పొరేటర్ భర్తపై యువతి తల్లి చెప్పుతో దాడి చేసే దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
బీజేపీ కార్పొరేటర్ భర్త ఆకుల శీను తమ కుమార్తెకు మాయ మాటలు చెప్పి లొంగతీసుకున్నాడని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు.
నిజామాబాద్ నగరంలోని వినాయకనగర్‌లో ఆకుల శీను ఇంటి ఎదుట యువతి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తమ కూతురి ఆచూకీ తెలపాలని కోరుతూ కార్పొరేటర్ భర్తపై దాడికి పాల్పడ్డారు.
అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడుతూ తమ కూతురిని వెంట పడడం మానేయాలని గత కొంత కాలంగా కోరుతున్నామన్నారు. అయినా కార్పొరేటర్ భర్త శీను పట్టించుకోవడం లేదన్నారు.
గత రాత్రి తమ బిడ్డని ఎత్తుకెళ్లాడని ఆరోపించారు. మాయ మాటలు చెప్పి మోసం చేశాడని మండిపడ్డారు. తమ కూతురిని ఎత్తుకెళ్లి కాంగ్రెస్ సర్పంచ్ ఇంట్లో ఉంచినట్టు వారు ఆరోపించారు.