విజయసాయి… విశాఖ వాసి…

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంటి పేరు వి. ఇపుడు అది కాస్తా విశాఖగా మారిపోయింది. విశాఖ సాయిరెడ్డి అంటూ విపక్షాలు ఎకసెక్కంగా అన్నా కూడా ఇపుడు అదే నిజం చేసి చూపించబోతున్నారు ఈ వైసీపీ…

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంటి పేరు వి. ఇపుడు అది కాస్తా విశాఖగా మారిపోయింది. విశాఖ సాయిరెడ్డి అంటూ విపక్షాలు ఎకసెక్కంగా అన్నా కూడా ఇపుడు అదే నిజం చేసి చూపించబోతున్నారు ఈ వైసీపీ కీలకనేత.

తనకు విశాఖ అంటే ఇష్టమని, ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాను అంటూ ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. అంటే విశాఖకు వలస వచ్చారు, ఇక్కడ ఉన్నది దోచుకుని పోతారు అంటూ ఈ మధ్య అదే పనిగా తమ్ముళ్ళు చేస్తున్న ఆరోపణల నేపధ్యం విజయ‌సాయిరెడ్డి ఇచ్చిన పక్కా క్లారిటీ ఇదన్న మాట.

తాను విశాఖలోనే ఉంటాను అంటూనే తనకు భూములు అన్నా ఆస్తులు అన్నా ఎలాంటి వ్యామోహంలేదని కూడా విజయసాయిరెడ్డి తేల్చి చెప్పేశారు. తనకు హైదరాబాద్ లో కూడా ఉన్నది అద్దె ఇల్లేనని అయన చెప్పుకున్నారు. భూకబ్జాలు చేసేవారన్నా అక్రమాలకు పాల్పడేవారన్న చెడ్డ‌కోపమని కూడా విజయసాయిరెడ్ది అంటున్నారు.

తన పేరు మీద ఎవరు ఇలాంటి పనులు చేయాలని చూసినా చట్టప్రకారం చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఇక విశాఖ సహా ఉత్తరాంధ్రా అభివృద్ధిని తాను కట్టుబడి ఉన్నానని కూడా విజయ‌సాయిరెడ్డి చెప్పడం విశేషం. 

మొత్తానికి విజయసాయిరెడ్డి పక్కా విశాఖ పౌరుడు, ఈ ప్రాంత అభివృద్ధి కాముకుడు. ఆయన మీద వలస ముద్ర వేసి బురద జల్లాలని చూస్తే సహించమని కూడా వైసీపీ నేతలు కూడా అంటున్నారు.