ఢిల్లీలో చాలా చోట్ల ఇలాంటి మార్గ్ లు కనిపిస్తాయి. అలాగే చాలా మంది ప్రముఖుల పేరు మీద కూడా ఆ రోడ్లకు పేర్లు పెడుతూంటారు. ఇపుడు అలాంటి అరుదైన గౌరవం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి దక్కింది.
ఆయనను విశాఖ సాయిరెడ్డి అని ప్రత్యర్ధులు ఎకసెక్కం చేయవచ్చు. కానీ ఆయన తమ ఎంపీ ల్యాండ్స్ నిధులతో పాటు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశాఖకు చాలా మేలు చేస్తున్నారు.
చాలా చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన తన వంతుగా సాయం చేస్తున్నారు. అటువంటి విజయసాయిరెడ్డి మీద అభిమానంతో పదిహేను లక్షలు ఖర్చు చేసి అభిమాని ఒకరు ఏకంగా విజయసాయిరెడ్డి మార్గ్ అని ఏర్పాటు చేశారు.
ఇలా అభివృద్ధి చేసిన మార్గాన్ని విజయసాయిరెడ్డి విశాఖలోని 89వ వార్డు ప్రజలకు అంకితం చేశారు. నిజంగా ఇది గొప్ప విషయమే. విశాఖ నుంచి ఎంతో మంది ప్రాతినిధ్యం వహించారు.
కానీ తక్కువ సమయంలోనే విశాఖ అంటే తాను అన్నట్లుగా ప్రగతి కార్యక్రమాలతో అందరిని ఆకట్టుకుంటున్న విజయసాయిరెడ్డి పేరు మీద ఒక మార్గం ఏర్పాటు చేయడం అంటే అది ప్రశంసించాల్సిన విషయమే. మరి
ఆయన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు విసృతంగా చేసి విశాఖలో చిరకీర్తిని ఆర్జిస్తారని వైసీపీ నేతలు అంటున్నారు.