విశాఖ ఆక్టోపస్ నిద్రలేచింది !

మనకు లోకల్  ఆక్టోపస్  లకు కొదవల్ లేదు. అయితే రాజకీయంగా ఫ్యామస్ అయ్యామనుకునే ఆక్టోపస్ లు చాలానే ఉన్నాయి. అవి చెప్పే జోస్యాలు చిలక జోస్యాల కంటే దారుణంగా ఉన్నా కూడా ఇంకా చెప్పేందుకే…

మనకు లోకల్  ఆక్టోపస్  లకు కొదవల్ లేదు. అయితే రాజకీయంగా ఫ్యామస్ అయ్యామనుకునే ఆక్టోపస్ లు చాలానే ఉన్నాయి. అవి చెప్పే జోస్యాలు చిలక జోస్యాల కంటే దారుణంగా ఉన్నా కూడా ఇంకా చెప్పేందుకే ప్రయత్నం చేయడమే  విచిత్రం.

ఆంధ్రా  ఆక్టోపస్ గా పేరు గడించిన మాజీ ఎంపీ లగడపాటి వరసగా రెండు ఎదురుదెబ్బలు తగిలేసరికి సైలెంట్ అయిపోయారు. తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాదని ఆయన 2018లో జోస్యం వదిలారు, అది బెడిసికొట్టింది. ఇక ఏపీలో చంద్రబాబుదే మళ్ళీ అధికారం అని తమ్ముళ్ళకు  కూడా భవిష్యత్తు బాగానే చూపించేశారు. అక్కడా ఫెయిల్ కావడంతో ఆయన సీన్లో కనిపించడంలేదు.

ఇక విశాఖలో మరో ఆక్టోపస్ ఉన్నారు. ఆయన సైతం అచ్చంగా లగడపాటి లాగానే బాబు గారే ఏపీలో గెలుస్తారని కుండబద్దలు కొట్టాడు. కుండ ముక్కలైంది, అలాగే  పసుపు పార్టీ కుంకుమ పోయింది. తెలంగాణాలో  టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని చెప్పి టీవీ డిబేట్లల్లో వీరావేశం చూపించిన సబ్బం హరి ఆ తరువాత కొన్నాళ్ళు కనిపించలేదు

ఇపుడు జగన్ సర్కార్ మీద వీలు దొరికినపుడుల్లా కారాలు మిరియాలు నూరే మాజీ వైసీపీ నేత కూడా అయిన  హరి తాజాగా ఓ టీవీ డిబేట్ లో మాట్లాడుతూ విశాఖ రాజధానిగా అక్కడ జనం ఎవరూ కోరుకోవడంలేనని తనదైన జోస్యం వినిపించారు.

అంతే కాదు ప్రజలంతా అమరావతి రాజధానిని కోరుతుంటున్నారని, అది సైలెంట్ గా ఉందని కూడా మరో విషయం తేల్చారు. విశాఖలో కార్పోరేషన్ కి ఇపుడు ఎన్నికలు పెడితే వైసీపీ ఓడిపోతుందని సబ్బం హరి సవాల్ చేస్తున్నారు

అలా జరగకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని గట్టి శపధాలే చేస్తున్నారు. మొత్తానికి విశాఖ ఆక్టోపస్ జోస్యాలు వరసగా ఫెయిల్ అవుతున్నా మళ్ళీ వైసీపీ ఓటమి అంటూ అపశకునం పలుకుతున్నారు. పైగా విశాఖ జనం విశాఖ వద్దంటున్నారని విచిత్ర వాదన ముందుకు తెస్తున్నారు.

అయన స్క్రీన్ పైన కనిపిస్తే చాలు