ఏజెన్సీ ఎర్రబారుతోంది….

ఏజెన్సీలో మళ్ళీ మోత మోగుతోంది. తుపాకీ తూటాల సౌండ్లతో మన్యం తల్లడిల్లుతోంది. ప్రశాంతంగా ఉన్న గిరి సీమల్లో ఇపుడు కాల్పుల కార్చిచ్చు రాజుకుంటోంది. ఏజెన్సీ మరో మారు పోలీసులకు మావోలకు సమర వేదిక అయింది.…

ఏజెన్సీలో మళ్ళీ మోత మోగుతోంది. తుపాకీ తూటాల సౌండ్లతో మన్యం తల్లడిల్లుతోంది. ప్రశాంతంగా ఉన్న గిరి సీమల్లో ఇపుడు కాల్పుల కార్చిచ్చు రాజుకుంటోంది. ఏజెన్సీ మరో మారు పోలీసులకు మావోలకు సమర వేదిక అయింది.

ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లో ఏజెన్సీలో మావోయిస్టులు ఆవిర్భావ వారోత్స‌వాలను జరుపుకుంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున మావోలు ఒక చోట జమ అవుతున్నారు. దాంతో ఇది సరైన సమయం అని పోలీసులు కూడా మావోలను టార్గెట్ చేస్తున్నారు.

దీంతో విశాఖ మన్యంతో పాటు ఒడిషా వరకూ అణువణువూ వణుకుతోంది. పోలీసులకు మావోయిస్టులు తారస‌పడినపుడు ఎదురు కాల్పులు జరిపామని పోలీసు వర్గాలు అంటున్నాయి. 

మరో వైపు మావోలు రెండు తెలుగు రాష్ట్రాలలో తమ భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశించుకునేందుకు ఈ కీలకమైన వారోత్సవాలలో అనేక సంచలన  నిర్ణయాలు తీసుకుంటారు అంటున్నారు. ఏది ఏమైనా మావోల అలజడి ఒక వైపు ఖాకీల కవాతు మరో వైపు దీంతో గిరిపుత్రులు బిక్కుబిక్కుమంటున్నారు.