విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నాడు అంతా నినదించారు. నిజమే ఆంధ్రుల కలసి సాధించుకున భారీ పరిశ్రమ ఇది. అయితే ఇపుడు ఆ ఉక్కు మీద మాకే హక్కు ఉందని కేంద్రం అంటోంది. తన పరిధిలో ఉన్న సంస్థను తాము ఏమైనా చేసుకుంటామని కూడా గట్టిగా చెబుతోంది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద నెలల తరబడి కార్మికులు ఆందోళను చేస్తున్నా కేంద్రానికి అసలు పట్టడంలేదు. చాలా కూల్ గా లైట్ గా తీసుకుంటోంది. దాంతో తిక్కరేగిన ఉక్కు కార్మికులు ఏకంగా స్టీల్ పాంట్ ని మూసేస్తామని గట్టి హెచ్చరికే చేస్తున్నారు.
మే నెల 7వ తేదేన స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా బంద్ చేస్తామని ప్రకటించారు. అంటే ఒక్క రోజు పాటు స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలు ఆగిపోతాయన్నమాట. అదే కనుక జరిగితే దేశానికి కావాల్సిన మెడికల్ అక్సిజన్ తయారు చేస్తున్న ఉక్కు నుంచి అతి పెద్ద షాకే కేంద్రానికి తగులుతుంది అంటున్నారు.
ఇప్పటికే బంద్ దిశగా భారీ ఏర్పాట్లు చేసుకున్న అఖిల పక్షం తన ఆందోళనను ఇంకా తేలిగ్గా తీసుకుంటే ముందు ముందు మరిన్ని భారీ షాకులు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారు.
సరైన సమయంలో బంద్ సైరన్ మోగిస్తున్న ఉక్కు కార్మికులు బంతిని కేంద్రం కోర్టులో వేశారు. మరి ఇపుడైనా కేంద్రం పాజిటివ్ గా రియాక్ట్ అవుతుందా. చూడాల్సిందే.