అతిగా నీళ్లు తాగినా సమస్యలే.. ఎందుకో తెలుసా?

వేసవికాలం వచ్చిందంటే చాలు, అప్పటివరకు రోజుకు 2-3 గ్లాసులు నీళ్లు తాగే వాళ్లు కూడా లీటర్ల కొద్దీ పట్టించేస్తుంటారు. ఎండాకాలం ఎంత నీరు తాగితే అంత మంచిదంటూ ఓ జనరల్ స్టేట్ మెంట్ పడేస్తారు.…

వేసవికాలం వచ్చిందంటే చాలు, అప్పటివరకు రోజుకు 2-3 గ్లాసులు నీళ్లు తాగే వాళ్లు కూడా లీటర్ల కొద్దీ పట్టించేస్తుంటారు. ఎండాకాలం ఎంత నీరు తాగితే అంత మంచిదంటూ ఓ జనరల్ స్టేట్ మెంట్ పడేస్తారు. కానీ అతిగా నీళ్లు తాగడం కూడా మంచిది కాదు. 

శరీరానికి ఇవ్వాల్సిన నీరు కంటే ఎక్కువగా ఇస్తే, మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందంటున్నారు నిపుణులు. వైద్య పరిభాషలో చెప్పాలంటే దీన్ని వాటర్ ఇన్ టాక్సికేషన్ అంటారు.

మితిమీరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో మినరల్స్ ఎక్కువై, సోడియం స్థాయిలు పడిపోతాయి. ఎప్పుడైతే సోడియం స్థాయిలు పడిపోతాయో శరీరంలో కణాల పనితీరు నెమ్మదిస్తుంది. దీని వల్ల తలనొప్పి, చిరాకు, వాంతులు లాంటి లక్షణాలు బయటపడతాయి.

ఇలా అతిగా నీరుతాగే లక్షణం మరింత పెరిగితే.. మెదడుపై ఆ ప్రభావం పడుతుంది. బీపీ పెరగడంతో పాటు, కండరాలు నీరసించిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో, అంతే నీళ్లు తాగాలి.

కొంతమంది పొద్దున్నే ఓ 2 లీటర్లు నీళ్లు తాగేసి, ఇక ఆరోజుకు పనైపోయిందని భావిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా వాటర్ ఇన్ టాక్సికేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. నీళ్లను ఒకేసారి కాకుండా.. శరీర తత్వానికి తగ్గట్టు మినిమం గ్యాప్స్ లో తీసుకోవాలి. అప్పుడే ఒంటికి మంచిది.