కోవిడ్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. థర్డ్ వేవ్ నెమ్మదిగా ప్రారంభమై ఒక్కసారిగా ఊపందుకుంది. కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు తాము కోవిడ్‌బారిన పడినట్టు తమకు తాముగా సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. అంతేకాదు, తమను కలిసిన వాళ్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇలాంటి వారి కోవలోకి తమిళ నటుడు విష్ణు విశాల్ చేరారు. తాను కోవిడ్‌బారిన పడినట్టు ఇవాళ ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు.
'2022.. 'పాజిటివ్' రిజల్ట్‌తో ప్రారంభించాను. అవును, నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నన్ను కలిసిన వాళ్లందరూ జాగ్రత్తగా ఉండండి. విపరీతమైన ఒళ్లు నొప్పులున్నాయి. ముక్కు పని చేయడం లేదు. గొంతుమంటగా ఉంది. జ్వరం కూడా వచ్చింది. వీలైనంత త్వరగా దీని నుంచి బయటపడతానని అనుకుంటున్నాను' అని ఆయన ట్వీట్ చేశారు.
విష్ణు నటించిన ఎఫ్‌ఐఆర్, మోహన్‌దాస్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విష్ణు విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు పలువురు సినీ యాక్టర్లు కోరుకుంటున్నారు.