విశాఖపట్నం బ్రిటిష్ వారే మెచ్చుకున్న సిటీ ఇప్పటికి 120 ఏళ్ల క్రితమే జిల్లాగా ప్రకటించి తెల్ల దొరలు అభివ్రుధ్ధి చేసిన నగరం. విశాఖలో ప్రస్తుతం ఉన్న కింగ్ జార్జి ఆసుపత్రి, విక్టోరియా ఆసుపత్రి, కలెక్టరేట్ వంటివన్నీ బ్రిటిష్ వారి చలువే.
ఇక విశాఖకు పోర్ట్ వచ్చినా, వాల్తేర్ రైల్వే ట్రాక్ వచ్చినా కూడా నాటి బ్రిటిషర్లు విశాఖను మేటి సిటీ అవుతుందని గుర్తించి చేసిన ప్రగతిగానే చూడాలి. ఇక స్వాతంత్రానంతరం విశాఖ మూలన విసిరేసినట్లుగానే ఉంది. ఉమ్మడి ఏపీలో కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపధ్యంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖకు ఫ్లై ఓవర్ తో పాటు మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం క్రుషి చేశారు.
అలాగే ఐటీ సిటీ కోసం కూడా నాడు వైఎస్సార్ తీసుకున్న చర్యలే ఇపుడు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో విశాఖ మీద మళ్ళీ చూపు ఎవరికైనా పడిందంటే అది జగన్ అనే చెప్పాలి. విశాఖను పాలనారాజధానిగా చేయాలన్న జగన్ సంకల్పం బహు గొప్పది.
ఇక విశాఖలో దాదాపు అయిదారువందల ఎకరాల్లో కాన్సెప్ట్ సిటీని క్రియేట్ చేయాలని కూడా ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు చేస్తున్నారు. ఐటీ సహా అన్ని రకాల అభివ్రుధ్ధిని అక్కడ పోగు చేయలన్నది జగన్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
త్వరలోనే దీనికి సంబంధించిన పనులకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా శ్రీకారం చుడతారని అంటున్నారు. మరో నాలుగేళ్ళలో విశాఖ రూపు రేఖకు మొత్తం మారిపోయేలా మెట్రో రైలు తో పాటు, అనేక అభివ్రుధ్ధి ప్రాజెక్టులు కూడా తీసుకురాబోతున్నారు.
అమరావతి వరల్డ్ సిటీ అని బాబు అయిదేళ్ళ కాలంలో ఊదరగట్టారు కానీ జగన్ చడీ చప్పుడూ లేకుండా విశాఖలో కాన్సెప్ట్ సిటీ చేపట్టడం ద్వారా చేతల ముఖ్యమంత్రిని అని నిరూపించుకుంటారని మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు. మొత్తానికి జగన్ మార్క్ డెవలప్మెంట్ విశాఖలో కనిపిస్తుంది అంటున్నారు.