విశాఖ తీరంలో యుద్ధ నౌకలు…ఏం జరుగుతోందంటే… ?

విశాఖ తీరంలో యుద్ధ నౌకలు క్యూ కట్టి ఉన్నాయి. తీరానికి సమీపంలోకి కూడా వచ్చేశాయి. ఇలా యుద్ధ నౌకలను కడు సమీపంలో చూడడం బహు అరుదు. అసలు యుద్ధ నౌకలను చూడాలంటేనే మామూలు రోజుల్లో…

విశాఖ తీరంలో యుద్ధ నౌకలు క్యూ కట్టి ఉన్నాయి. తీరానికి సమీపంలోకి కూడా వచ్చేశాయి. ఇలా యుద్ధ నౌకలను కడు సమీపంలో చూడడం బహు అరుదు. అసలు యుద్ధ నౌకలను చూడాలంటేనే మామూలు రోజుల్లో చాలా కష్టం. కానీ ఇపుడు ఒకదాని వెంట ఒకటి యుద్ధ నౌకకు తీరం వెంబడి ఎందుకు క్యూ కడుతున్నాయంటే అక్కడే విశేషం ఉంది.

విశాఖ తూర్పు నావికాదళంలో ఈ నెల 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం ఉంది. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ రామ్ నాధ్ కొవింద్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు నౌకాదళం పరిధిలోని పలు నౌకలు, హెలికాప్టర్లతో విశాఖ సముద్రంలో రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు.

దాంతో విశాఖ సాగర తీరం అంతా యుద్ధ వాతావరణంతో  కనిపిస్తోంది. ఏ వైపు చూసినా సమర నినాదాలే వినిపిస్తున్నాయి. ఇక దేశం నలుమూలల నుంచి ఎక్కడెక్కడి యుద్ధ నౌకలు అన్నీ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూకి తరలివస్తున్నాయి. దాంతో ఒకదాని తరువాత ఒకదానిగా వస్తున్న ఈ   నౌకలకు క్లియరెన్స్ ఇవ్వడంలో తీరంలో ఆ  నౌకలు  వెయిట్ చేస్తున్నాయి.

దాంతో వాటిని చూసేందుకు నగరవాసులకు అలా  మంచి అవకాశం లభిస్తోంది. మరో వైపు చూస్తే విశాఖ పూర్తిగా అలెర్ట్ అవుతోంది. మరో వైపు చూస్తే రాష్ట్రపతి రాకతో నగరమంతా భద్రతావలయంలోకి వెళ్ళిపోయింది. మొత్తానికి చూస్తే కొన్ని రోజుల పాటు విశాఖలో ఈ హడావుడి, అధికార ఆర్భాటం ఉంటుందనే చెప్పాలి.