స్టీల్ ప్లాంట్ కార్మికుల మెడపై వీయారెస్ కత్తి?

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ యాభై ఏళ్ల క్రితం విశాఖ నుంచి వినిపించిన నినాదం ఢిల్లీ దాకా పాకింది. దాంతో నాటి కేంద్ర ప్రభుత్వం విశాఖకు స్టీల్ ప్లాంట్ ని మంజూరు చేసింది.…

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ యాభై ఏళ్ల క్రితం విశాఖ నుంచి వినిపించిన నినాదం ఢిల్లీ దాకా పాకింది. దాంతో నాటి కేంద్ర ప్రభుత్వం విశాఖకు స్టీల్ ప్లాంట్ ని మంజూరు చేసింది.

గత నలభైఏళ్ళుగా దేశంలో నంబర్ వన్ ప్లాంట్ గా ఉన్న స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర  పాలకులు తాజాగా పగ పూనారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి 11.7 మిలియన్ టన్నుల టన్నుల వరకూ ఉత్పత్తి పెరిగింది. ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకుని స్టీల్ ప్లాంట్ పేరు ప్రఖ్యాతులు గడించింది.

అటువంటి ప్లాంట్ ని కుదించి ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు రంగం సిధ్ధం అవుతోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ లో వీఆరెస్ అమలు చేస్తూ బోర్డ్ తాజాగా తీసుకున్న నిర్ణయం  ఆందోళన రేపుతోంది.

45 ఏళ్ళ వయసు, లేకపోతే 15 ఏళ్ళ సర్వీస్ ఉంటే చాలు ఇంటికి పంపించేందుకు రంగం సిద్ధం కావడం పట్ల కార్మిక లోకం మొత్తం అగ్గి రాజేస్తోంది. ఇదంతా విదేశీ కంపెనీ పోస్కోకు స్టీల్ ప్లాంట్ ను అప్పగించేందుకు మోడీ సర్కార్ చేస్తున్న కుట్ర అని కార్మిక‌ సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.

ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ సర్కార్ ఏడాదికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఊడబెరుకుతోందని కార్మిక‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు కోసం మరో ఉద్యమానికి అంతా సిద్ధమవుతున్నారు

చంద్రబాబు బీజేపీని కూడా మేనేజ్ చేశారా?