అప్పు చేస్తే తప్పా… ?

అప్పు చేయడం అన్నది ఈ దేశానికి కొత్తేమీ కాదు. ఆ మాటకు వస్తే ఈ దేశాన్ని గత ఏడున్నర దశాబ్దాలుగా ఏలిన పాలకులు అప్పులు ఎన్ని లక్షల కోట్లు తెచ్చారో కచ్చితమైన చిట్టాపద్దుల లెక్కలు…

అప్పు చేయడం అన్నది ఈ దేశానికి కొత్తేమీ కాదు. ఆ మాటకు వస్తే ఈ దేశాన్ని గత ఏడున్నర దశాబ్దాలుగా ఏలిన పాలకులు అప్పులు ఎన్ని లక్షల కోట్లు తెచ్చారో కచ్చితమైన చిట్టాపద్దుల లెక్కలు పెద్ద ఎత్తున  ఉన్నాయి.

అప్పు తెచ్చి సంక్షేమం చేస్తామంటే తప్పు అంటే ఎట్లా అంటూ సూటిగానే ప్రశ్నిస్తున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్. అప్పు చేయడం అన్నది నేరంగా ఘోరంగా చూడడం ఏంటి ఆయన మండిపడ్డారు. అప్పు చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కుగా ఆయన స్పష్టం చేశారు.

అప్పు చేసిన ఏపీని అభివృద్ధి చేస్తున్న ఏకైక సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. ఏపీలో విద్య, వైద్యం, సేద్యానికి విశేషమైన ఆదరణ కల్పించడం కాకుండా వాటిని ప్రగతిపధంలో నడిపిస్తున్న ప్రజా నాయకుడు జగన్ అని కూడా తమ్మినేని పేర్కొన్నారు.

అప్పులు చేయడం మహా పాపం అంటున్న చంద్రబాబు తన హయాంలో లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏపీని అందులో కూరుకుపోయేలా చేశారని తమ్మినేని మండిపడుతున్నారు. జగన్ మాత్రం తెచ్చిన ప్రతీ పైసా సంక్షేమానికి, ఏపీ అభివృద్ధికే ఖర్చు చేస్తున్నారని ఆయన విశ్లేషించారు.  

అభివృద్ధి విషయంలో గత టీడీపీని ప్రస్తుత ప్రభుత్వాన్ని బేరీజు వేసుకుని జనం వైసీపీకే అండగా ఉంటున్నారని స్పీకర్ పేర్కొన్నారు. మొత్తానికి అప్పు తప్పు అంటూ గగ్గోలు పెడుతున్న విపక్షానికి స్పీకర్ తనదైన శైలిలో బాగానే క్లాస్ తీసుకున్నారు అనుకోవాలి.